Nana Patekar: ఫ్యాన్ చెంప చెళ్లుమనిపించిన సీనియర్ నటుడు… మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే?

బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. గతంలో తనుశ్రీ దత్తా అనే హీరోయిన్ నానా పటేకర్ పై మీటూ ఆరోపణలు చేసిన గుర్తుండే ఉంటుంది. తాజాగా ఆయన ఓ అభిమానిని చెంపదెబ్బ కొట్టి ఆయనను విమర్శించే వారికి దొరికిపోయారు. గత బుధవారం వారణాసిలో ‘జర్నీ’ అనే సినిమా షూటింగ్‌ సందర్భంగా ఓ అభిమానిని నానా చెంప చళ్లుమన్పించారు. ఆయనతో ఎంతో ఆశగా సెల్ఫీ దిగేందుకు వచ్చిన ఆ అభిమానితో ఈ సీనియర్ నటుడు అంత దురుసుగా ప్రవర్తించడాన్ని వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, వైరల్ అయ్యింది. దీంతో ఈ ముసలాడికి ఇంత పొగరు ఎందుకు అంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. దీంతో నానా పటేకర్ సారీ చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు.

ప్రస్తుతం అనిల్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జర్నీ’ చిత్రంలో నానా పటేకర్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఉత్కర్ష్ శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఏ మూవీ షూటింగ్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరుగుతోంది. సినిమాలోని ఓ సన్నివేశం షూటింగ్ కోసం మార్కెట్‌లో నానా నిలబడి ఉండగా, ఓ అభిమాని అతనితో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడట. అయితే అతను సెల్ఫీ దిగడానికి ప్రయత్నించడంతో ఈ నటుడికి కోపం వచ్చి కొట్టలేదట. అసలు కారణం ఏంటో ఆయనే ఓ వీడియోలో వెల్లడించాడు.

ఈ మేరకు నానా పటేకర్ తన ట్విట్టర్ లో ఒక వీడియోను పంచుకున్నాడు. అందులో ఆయన మాట్లాడుతూ ‘నేను ఒక పిల్లవాడిని కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఆ సమయంలో మేము ఒక సన్నివేశం కోసం రిహార్సల్స్ చేస్తున్నాము. షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి వీడియోలోని పిల్లవాడు సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. అతనే ఆ సీన్ లో నటించాల్సిన వ్యక్తి అనుకుని సీన్‌ ప్రకారం కొట్టి, దురుసుగా ప్రవర్తించవద్దని చెప్పాం. తర్వాత తెలిసింది అతను ఆర్టిస్ట్ కాదని. దీంతో మేము పిలిచి సారీ చెప్పడానికి వెళ్ళాము, కాని అతను పారిపోయాడు. ఫోటోలు తీయకుండా మేము ఎవరినీ ఆపలేదు. అక్కడ చాలా రద్దీగా ఉంది. ఈ సీన్ షూటింగ్ మార్కెట్‌లో జరిగింది. అతన్ని పొరపాటుగా కొట్టాను. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు క్షమించండి” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియోను చూస్తుంటే వివాదం సద్దుమణిగేలాగే కన్పిస్తోంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు