Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న డిస్ట్రిబ్యూటర్లు

 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్” డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటించింది. ఇక సినిమా అప్డేట్స్ గురించి ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూవీ ప్రమోషన్స్ త్వరలో స్టార్ట్ కానున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “సలార్” ట్రైలర్ డిసెంబర్ 1న రాత్రి 7:19 గంటలకు విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇక గత కొన్ని రోజులుగా నిర్మాతలు వివిధ ప్రాంతాల పంపిణీదారుల వివరాలను వెల్లడిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఆంధ్రా డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ ను కూడా ప్రకటించారు. ఆ లిస్ట్ చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రభాస్ కెరీర్‌లో అత్యంత కీలకమైన చిత్రాలలో ఒకటిగా వస్తున్న “సలార్” మూవీని ఇలాంటి వారి చేతిలో పెట్టడం ఏంటి అని డార్లింగ్ ఫ్యాన్స్ సైతం టెన్షన్ పడుతున్నారు. సాధారణంగా పెద్ద చిత్రాలను టాప్ డిస్ట్రిబ్యూటర్లు విడుదల చేస్తారు. ఎందుకంటే టాప్ డిస్ట్రిబ్యూటర్‌లు సినిమా విడుదలను మంచి ప్లానింగ్ తో ఎగ్జిక్యూట్ చేస్తారు. మరి “సలార్” నిస్సందేహంగా భారీ ప్రాజెక్టే, అంతేకాకుండా దర్శక దిగ్గజం రాజమౌళి చిత్రాల తర్వాత టాలీవుడ్‌లో వస్తున్న అతిపెద్ద చిత్రం ఇదే. అయితే తాజాగా విడుదల చేసిన ఏపీ డిస్ట్రిబ్యూటర్ల జాబితాలో ఎక్కువ మంది డిస్ట్రిబ్యూటర్లు ఇంకా పంపిణీదారులుగా నిలదొక్కుకుంటున్న వారు కావడం విశేషం. డిస్ట్రిబ్యూటర్ల పేర్లు చూసి షాక్ అవుతున్న అభిమానులు వీళ్లంతా సినిమాను ఎలా ప్లాన్ చేసి థియేటర్లలో రిలీజ్ చేస్తారా ? అని ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో సినిమాను పంపిణీ చేసే వారి వివరాల విషయానికొస్తే… ఉత్తరాంధ్ర ప్రాంతంలో శ్రీ సిరి సాయి సినిమాస్, తూర్పుగోదావరిలో లక్ష్మీ నరసింహ శ్రీ మణికంఠ ఫిలిమ్స్, పశ్చిమ గోదావరిలో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, కృష్ణా, గుంటూరు రీజియన్లలో కెఎస్ఎన్ టెలి ఫిలిమ్స్, నెల్లూరులో శ్రీ వెంగబాంబ సినిమాస్, సీడెడ్‌లో శిల్పకళా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించబోతున్నాయి. కాగా సినిమా రిలీజ్ అయితేనే కానీ ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ తగ్గేలా లేదు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు