Biggboss season 7: తాను స్ట్రాంగ్ అని మళ్ళీ నిరూపించుకున్న అర్జున్!

టెలివిజన్ లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన అంబటి అర్జున్ తన ఆటతో దూసుకుపోతున్నాడు. అర్జున్ ఎంట్రీ ఇచ్చిన రోజు నుండి తాను ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా, ముఖ్యంగా ఫిజికల్ గా అన్ని టాస్కుల్లో కూడా సత్తా చాటుతున్నాడు. ఇక ఎంట్రీ ఇచ్చిన రెండు వారాలకే కెప్టెన్ అయ్యాడంటే అతను ఎంత స్ట్రాంగ్ ప్లేయరో అర్ధం చేసుకోవచ్చు. అయితే వైల్డ్ కార్డు ఎంట్రీయే తన తనకి టాప్ లో ఉండనివ్వకుండా చేస్తుందని చెప్పొచ్చు.

ఎందుకంటే అర్జున్ బయట 5వారాలు చూసి వచ్చాడు కాబట్టి, ముందు నుండి ఉన్న కంటెస్టెంట్స్ ఎంత సపోర్ట్ చేసినా, టాప్ ప్లేయర్ గా మాత్రం కన్సిడర్ చేయలేదు. టాప్ 10 లో అందరూ కలిసి 8వ ప్లేస్ ని ఇచ్చారు. అయితే బిగ్ బాస్ లో తాను ఎంత స్ట్రాంగ్ ప్లేయరో వాళ్ళు బయట ఆడియన్స్ తో పాటు, లోపల ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. అందుకే బిగ్ బాస్ పెట్టిన టాస్క్ లో విన్ అయ్యాడు.

6 నుండి 10 ప్లేస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి మధ్యలో పెట్టిన టాస్క్ లో అర్జున్ చాలా సింపుల్ గా విన్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక ఆ టాస్క్ లో గెలిచిన అర్జున్ టాప్ 5 లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరైనా ఒకరితో పోటీ పడాల్సిందని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఇక అర్జున్ తెలివిగా ఆడియన్స్ నుండి కూడా ట్రోలింగ్ రాకుండా తన సమవుజ్జి గా యావర్ ని ఎన్నుకున్నాడు. మరి ఈ టాస్క్ లో ఎవరు విన్ అయ్యారనేది ఈరోజు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ లో తెలుస్తుంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు