Mangalavaaram First Review: మంగళవారం ఫస్ట్ రివ్యూ

అజయ్ భూపతి డైరెక్షన్‌‌లో వచ్చిన RX 100 మూవీ ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా కేవలం అజయ్ కి మాత్రమే కాదు.. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, హీరో కార్తికేయ కెరీర్ కి కూడా బూస్ట్ ఇచ్చింది. ఇందులో కార్తికేయ ఒక్కడే కెరీర్ పరంగా కాస్త ముందుకు వెళ్లాడు. కానీ, అజయ్ భూపతి, పాయల్ రాజ్ పుత్ కి మళ్లీ RX 100 లాంటి హిట్ రాలేదు.

ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుంది. అదే మంగళవారం. డిఫరెంట్ టైటిల్ కావడంతో.. అనౌన్స్ చేసిన నాటి నుంచే సినిమాపై మంచి హైప్ ఉంది. దీనికి తోడు అజయ్ భూపతి, పాయల్ రాజ్ పుత్ ప్రమోషన్స్ వల్ల ఇప్పటికే ఉన్న హైప్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. పేరుకు చిన్న సినిమా కానీ, పెద్ద సినిమాలకు ఉన్నంత బజ్ ఇప్పుడు ఉంది. అలాంటి సినిమా ఫస్ట్ రివ్యూ ఇప్పుడు వచ్చింది. ఎలా ఉందో ఇప్పుడు చూద్ధాం.

సినిమా స్టార్టింగ్ 20 నుంచి 30 నిమిషాలు కాస్త స్లోగా ఉంటుందట. పేరు తెలియని క్యారెక్టర్లు వస్తుండటం వల్ల స్టార్టింగ్ లో బోర్ అనే ఫీలింగ్ వస్తుందట. కానీ, 30 నిమిషాల తర్వాత పాయల్ రాజ్ పుత్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్టోరీపై నెమ్మదిగా ఇంట్రెస్ట్ పెరుగుతుందని తెలుస్తుంది. ఇక ఇంటర్వెల్ సీన్ కు అయితే ఆడియన్స్ వచ్చే రెస్పాన్స్ మామూలుగా ఉండదని టాక్. రీసెంట్ సినిమాలను చూస్తే మంగళవారం ఇంటర్వెల్ సీన్ నెక్ట్స్ లెవెల్ ఉంటుందట.

- Advertisement -

థ్రిల్లింగ్ ఇంటర్వెల్ సీన్ తర్వాత సెంకండాఫ్ ఎక్కడా తగ్గకుండా అజయ్ భూపతి స్టైల్ లో వెళ్తుందట. ఇక సినిమా చివరలో 40 నుంచి 45 నిమిషాలు గూస్‌బామ్స్ వచ్చేలా ఉటుందని టాక్. మొత్తానికి అజయ్ – పాయల్ రాజ్ పుత్ RX100 కంటే బిగ్ హిట్ కొట్టినట్టే అని తెలుస్తుంది.

అలాగే సినిమాలో అక్కడక్కడ అ*ల్ట్ కంటెంట్ ను కూడా అజయ్ యూజ్ చేశాడట. అ*ల్ట్ కంటెంట్ తో పాటు అజయ్ భూపతి ఈ సారి చేతబడులు టాపిక్ ను కూడా ఎంచుకున్నాడు. ఈ చేతబడుల టాపిక్ కు కూడా సినిమాలో బాగానే వర్కౌట్ అయిందని తెలుస్తుంది. ఇక సినిమాలో పాయల్ రాజ్ పుత్, నందిత శ్వేత ప్రధాన పాత్రలు. కానీ, వీరి కాంబినేషన్స్ లో ఎలాంటి సన్నివేశాలు ఉండవు. కానీ, ఇద్దరి పాత్రల్లో ట్విస్ట్ లు ఎక్కువగానే ఉంటాయని టాక్ వస్తుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు