Dasara: “చమ్కీల అంగిలేసి” పాడిన బ్యూటీ ఎవరో తెలుసా…?

టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా దసరా మూవీ మేనియానే కొనసాగుతోంది. దసరా మూవీ ట్రైలర్ సృష్టించిన బీభత్సం ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రియాలిస్టిక్ విధానంతో సినిమా తీశారు. ట్రైలర్ అద్భుతంగా కట్ చేశారు. ఈ చిత్రం పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. నాని బీస్ట్ మోడ్ కూడా మామూలుగా లేదు.

మార్చి 30న దసరా చిత్రం విడుదల కోసం తెలుగు ప్రేక్షకులే కాదు. యావత్ దేశ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో “ చమ్కీల అంగిలేసి” అనే పాట బాగా వైరల్ గా మారడంతో ఈ పాట పాడిన సింగర్స్ ఎవరు అని సోషల్ మీడియాలో బాగా వెతుకుతున్నారు. అయితే ఈ పాట పాడిన వారిలో మేల్ సింగర్ రామ్ మిరియాల మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. ఇక ఫిమేల్ సింగర్ విషయానికి వస్తే ఈ పాట పాడిన అమ్మాయి పేరు దీక్షిత అలియాస్ ది. ఈమె తెలుగులో ఇప్పటికే కొన్ని పాటలు పాడింది. కానీ, ఈ రేంజ్ లో ఒక పాట వైరల్ కావడం ఇదే మొదటిసారి.

మొన్నటికి మొన్న హీరో సూర్య నటించిన ఆకాశమే హద్దురా అనే చిత్రంలో సైతం “కాటుక కనులే..” అనే పాట పాడింది దీక్షిత. ఈ పాట ఆమెకు మంచి పేరును తీసుకొచ్చింది. సంచలన రికార్డులు నమోదు చేసిన “రౌడీ బేబీ..” పాట కూడా దీక్షిత పాడింది కావడం విశేషం. అలాగే దీక్షిత తన 14వ ఏట నుంచి పాటలు పాడడం ప్రారంభించింది. సంచలన సంగీత దర్శకుడు అయిన సంతోష్ నారాయణ కుటుంబం నుంచే దీక్షిత వచ్చింది. దీక్షిత ఎక్కువ శాతంగా సంతోష్ నారాయణ సంగీతం అందించే సినిమాలకే పాటలను పాడుతుంది. దసరా సినిమాకి సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు