Manoj: మంచు ఫ్యామిలీలో కొత్త కోడలు హవా

సినీ ఇండస్ట్రీలో మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మంచు ఫ్యామిలీలో ఎటువంటి ట్రోల్స్ ఎదుర్కొని ఏకైక నటుడిగా కూడా ఈయన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్న మంచు మనోజ్, మౌనిక రెడ్డి ఎట్టకేలకు రూమర్లకు తెరదించుతూ మార్చి మూడవ తేదీన రాత్రి ఫిలింనగర్ లో 8:30 గంటల సమయంలో మంచు లక్ష్మీ నివాసంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

అయితే మనోజ్ పెళ్లి ముహూర్తానికి కొన్ని గంటల ముందు మోహన్ బాబు హాజరయ్యారు. నూతన వధూవరులను సతి సమేతంగా ఆశీర్వదించారు. మంచు విష్ణు మాత్రం అంటిముట్టనట్టుగా వ్యవహరించారు. కాగా విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు మార్చి 19న 71వ ఏటా అడుగు పెట్టారు. విలన్ గా ప్రస్థానం మొదలుపెట్టిన మోహన్ బాబు స్టార్ హీరో స్థాయికి ఎదిగారు. సుదీర్ఘ సినిమా ప్రస్థానంలో క్యారెక్టర్ కామెడీ రోల్స్ సైతం చేశారు.

500 కు పైగా చిత్రాల్లో నటించారు. నిర్మాతగా పదుల సంఖ్యలో చిత్రాలు నిర్మించి, కళామతల్లికి సేవ చేశారు. ఇక మోహన్ బాబు పుట్టినరోజు వేడుకల్లో కొత్త కోడలు మౌనిక రెడ్డి అన్ని తానై వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. మామయ్య మోహన్ బాబు బర్త్డే ఈవెంట్లో ఆమె పాల్గొన్న ఫోటోలు బయటకు వచ్చాయి. కుటుంబ సభ్యులు అందరూ గుడికి వెళ్లారు. ప్రత్యేక పూజలు చేశారు. మోహన్ బాబుతో పాటు భార్య నిర్మలాదేవి, కూతురు లక్ష్మీ మంచు మనవరాలు, కొడుకు మనోజ్, కోడలు మౌనిక ఉన్నారు. అయితే మంచు విష్ణు మిస్ మోహన్ బాబు బర్త్డే సెలబ్రేషన్స్ ఫోటోలు మంచు లక్ష్మి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు