NTR : విశ్వక్ ఈవెంట్‌లో తారక్ ధరించిన హూడీ ప్రైజ్ ఎంతో తెలుసా ?

యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో వస్తున్న మూవీ దాస్ క ధమ్కీ. ఈ మూవీ ఉగాది సందర్భంగా మార్చి 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ఫుల్ జోష్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. మార్చి 17న ఈ చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. ఈవెంట్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.

ఇటీవలనే లాస్ ఏంజెల్స్ నుండి నాటు నాటు పాట ఆస్కార్ అందుకున్నాక తిరిగి వచ్చిన ఎన్టీఆర్, ఈ ఈవెంట్ కు అటెండ్ అయ్యాడు. దీంతో ఎన్టీఆర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. అలాగే తారక్ ధరించిన హూడీ కూడా వార్తల్లోకి ఎక్కింది. ఈ బ్లాక్ కలర్ హూడిలో జూనియర్ ఎన్టీఆర్ స్టైలిష్ గా కనిపించాడు. ఆ హూడీ మీద ఫైర్ డిజైన్ గ్రాఫిక్ ప్రింటింగ్, బ్లాక్ మరియు వైట్ షేడింగ్ తో ఉన్నది. అది చూసిన ఫ్యాన్స్ చాలా ఇంప్రెస్స్ అయ్యారు.

దీన్ని చూసిన తర్వాత ఆ హూడీ ఎంత ప్రైజ్ ఉంటుంది అంటూ నందమూరి అభిమానులు గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. కాగా హూడీ ధర చూస్తే ఓనిట్సుకా టైగర్ అనే వెబ్ సైట్ లో 170 యూరోస్ అని ఉంది, అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ.15 వేలు. ధర తెలిసిన తర్వాత అందరూ షాక్ అయ్యారు.

- Advertisement -

విశ్వక్ సేన్ ఈ ఈవెంట్ జరిగినంత సేపు ఎన్టీఆర్ తోనే ఉన్నాడు, ఈవెంట్ తర్వాత ట్విటర్ లో విశ్వక్ మరియు ఎన్టీఆర్ కలిపి దిగిన ఫోటో ని షేర్ చేసి, లవ్ యు అన్న అని తారక్ ని టాగ్ చేసాడు. తాను ఎన్టీఆర్ కి పెద్ద ఫ్యాన్ అని స్పీచ్ లో చెప్పాడు విశ్వక్. 22 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా లో నివేత పెతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు