Salaar: సలార్ మూవీ మేకింగ్ వీడియో..చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!!

Salaar: ప్రభాస్ హీరోగా.. పృధ్విరాజ్ సుకుమారన్ విలన్ గా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం సలార్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ చిత్రంలో శ్రియా రెడ్డి, జగపతిబాబు, బాబీ సింహ , శృతిహాసన్ వంటి వారు నటించారు. సంగీతాన్ని రవి బస్రూర్ అందించడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్ల రూపాయల కలెక్షన్స్ తో ఒక సునామీని సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రంలోని సన్నివేశాలను, లొకేషన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు.

ఇటీవల తాజాగా చిత్ర బృందం ఒక మేకింగ్ వీడియోని సైతం రిలీజ్ చేశారు. ఈ మేకింగ్ వీడియోలో హైలెట్ సీన్స్ చిత్రీకరణ జరిపినట్లుగా చూపించారు .భారీ సెట్స్ వేసి భారీ క్రూ మెంబర్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా కనిపిస్తోంది.. ఈ మేకింగ్ వీడియోలో కనిపించిన కొన్ని విజువల్స్ చూసి ఆడియన్స్ థ్రిల్ అయ్యేలా ఉన్నారు. ముఖ్యంగా సలార్ సినిమాలోని ఖాన్సర్ కోటలో పెద్దపెద్ద విగ్రహాలు కత్తులు పట్టుకొని నిలబడినట్టుగా కనిపిస్తున్నాయి.

ఇది గ్రాఫిక్స్ లో చూపించారని అందరూ అనుకున్నారు కానీ ఈ మేకింగ్ వీడియోలో అవి సెట్ ప్రాపర్టీగా కనిపిస్తున్నాయి. అలాగే ఎలిఫ్ క్వార్టర్స్ యుద్ధ విమానాలను కూడా గ్రాఫిక్స్ లోనే కాకుండా ఒరిజినల్ గానే చూపించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఇక ఇవి గమనించిన ఆడియన్స్ సైతం ప్రశాంత్ నీల్ ఈ సినిమా కోసం చాలానే కష్టపడినట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

సలార్ సినిమాలో భారీగా కనిపించిన ఖాన్సర్ సిటీని చాలావరకు నిర్మించినట్లుగా కనిపిస్తున్నది . ప్రతి మేకింగ్ షూట్ లో కూడా టెక్నీషియన్స్ , యాక్టర్లు కలుపుకొని దాదాపుగా వందమందికి పైగా మెంబర్స్ ఈ సెట్ లో పనిచేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి ఈ మేకింగ్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో అందరిని ఆకట్టుకుంటోంది. మొత్తానికి సలార్ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ .178 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. రెండవ రోజు రూ.117 కోట్లు , మూడవరోజు రూ .100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి మొత్తంగా మూడు రోజులకు రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు