Animal: ఓటిటీ వెర్షన్ కు అంత సీన్ లేదు… ప్రేక్షకులకు మిగిలేది నిరాశే!

Animal: మోస్ట్ వైలెన్స్ మూవీ “యానిమల్” ఓటిటి వెర్షన్ గురించి ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు తీవ్ర నిరాశ ఎదురు కాబోతోంది. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తాను నెట్ ఫ్లిక్స్ వెర్షన్ ను ఎడిట్ చేస్తున్నాను అని చెప్పడంతో అందరిలో ఆసక్తి రెట్టింపు అయ్యింది. థియేటర్లలో చూడలేకపోయిన సీన్లను కూడా ఓటీటీలో చూడవచ్చని ఆశతో ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. కానీ తాజాగా నిర్మాత ప్రణయ్ రెడ్డి ఇచ్చిన అప్డేట్ తో “యానిమల్” ఓటిటీ వెర్షన్ కు ప్రేక్షకులు ఊహిస్తున్నంత సీన్ ఏం లేదని సమాచారం.

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ వైలెంట్ మూవీ “యానిమల్”. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా, మరో బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రి, అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాలో సందీప్ రెడ్డి వంగా స్టైల్ లో చూపించిన మ్యాడ్ వైలెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమాపై భారీ ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ పట్టించుకోకుండా సినీ ప్రియులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.

ఫలితంగా ఈ మూవీ కలెక్షన్ల పరంగా బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసింది. ఎనిమిది వందల కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి ఈ ఏడాది స్పెషల్ మూవీగా నిలిచింది. ఇక ఆ తర్వాత థియేటర్లలోకి హాయ్ నాన్న, డంకి, సలార్ వంటి సినిమాలు రావడంతో “యానిమల్” జోరుకు బ్రేకులు పడ్డాయి. దీంతో ఈ మూవీ ఓటిటీ వర్షన్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇక రీసెంట్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ నెట్ ఫ్లిక్స్ వర్షన్ 3 గంటల 30 నిమిషాల పాటు ఉంటుందని, సెన్సార్ బోర్డు కట్ చేసిన సన్నివేశాలను ఇందులో యాడ్ చేస్తున్నామని ప్రకటించడంతో ఎంతో ఆశగా నెట్ ఫ్లిక్స్ లో ఆ ఎక్స్ట్రా సన్నివేశాలను కలిపి సినిమాను చూడొచ్చని ఆశిస్తున్నారు.

- Advertisement -

కానీ వాళ్ళ ఆశ నిరాశే కాబోతోంది. కొన్ని రోజుల క్రితం నెట్ ఫ్లిక్స్ భారతీయ సినిమాల సెన్సార్ వెర్షన్ ను మాత్రమే నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం చేస్తామంటూ వెల్లడించి కొత్త రూల్ ను ప్రకటించింది. తాజాగా “యానిమల్” మూవీ నిర్మాత ప్రణయ్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓటిటిలో “యానిమల్” అన్ సెన్సార్డ్ వెర్షన్ స్ట్రీమింగ్ సాధ్యం కాకపోవచ్చు. డిలీట్ చేసిన సన్నివేశాలను యూట్యూబ్ లో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకేముంది నెట్ ఫ్లిక్స్ లో సైతం సెన్సార్ వర్షన్ “యానిమల్” మూవీనే అందుబాటులోకి రాబోతోంది. మరి అన్ సెన్సార్డ్ వర్షన్ “యానిమల్” మూవీని ఎప్పుడు, ఎలా రిలీజ్ చేస్తారు? అనే విషయం తెలియాల్సి ఉంది.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు