Ram Charan : క్రికెట్ లీగ్ లోకి చెర్రీ ఎంట్రీ… హైదరాబాద్ జట్టుకు యజమాని

Ram Charan :మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం “గేమ్ చేంజర్” మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలు, మరోవైపు కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ ను ఏర్పాటు చేసి నిర్మాతగానూ రాణిస్తున్నారు. ఇంకోవైపు ఎయిర్ లైన్స్ బిజినెస్ కూడా చేస్తూ టాలీవుడ్ లోనే స్మార్ట్ హీరో అనిపించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే చెర్రీ క్రికెట్ లీగ్ లోకి అడుగు పెట్టడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దానికోసం ఏకంగా ఓ క్రికెట్ జట్టును రామ్ చరణ్ కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని చెర్రీ స్వయంగా ప్రకటించాడు. చార్మినార్ నేపథ్యంలో రూపొందించిన చరణ్ ఫోటోతో అధికారిక ప్రకటనను విడుదల చేసి, ఆసక్తి ఉన్న ఆటగాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.

ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ తో స్ట్రీట్ ఆటగాళ్లలో ఉన్న టాలెంట్ ను వెలికి తీసేందుకు రాంచరణ్ ముందుకు వచ్చాడు. ఈ మేరకు ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ లో ఉన్న హైదరాబాద్ జట్టును రాంచరణ్ కొనుగోలు చేశాడు. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను ప్రోత్సహించడానికి, సమాజ స్ఫూర్తిని పెంపొందించడానికి, గల్లి క్రికెట్ ను సంస్కృతిని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ వెంచర్ ఉపయోగపడుతుందని, ఐఎస్పిఎల్ లో హైదరాబాద్ జట్టును మెరుగుపరుస్తూ చిరస్మరణీయ క్షణాలను ఆహ్వానించడానికి నాతో భాగం పంచుకోండి అని రామ్ చరణ్ ట్వీట్ చేసి పిలుపునిచ్చారు. అయితే ఐఎస్పిఎల్ అంటే ఐపీఎల్ కాదు ఇదొక గల్లి క్రికెట్ లీగ్.

టీ10 ఫార్మాట్లో జరగబోయే టెన్నిస్ క్రికెట్ లీగ్. నగరాల్లో ఈ ఆటకు సంబంధించిన సదుపాయాలను మెరుగుపరిచి ఈ లీగ్ ద్వారా యంగ్ క్రికెటర్లలో ఉన్న టాలెంట్ ను బయటకు తీసి భావిభారత క్రికెట్ స్టార్స్ గా తీర్చిదిద్దబోతున్నారు. 2024 మార్చి 2 నుంచి 9 వరకు ఈ ఐఎస్పిఎల్ మ్యాచ్ లు జరగబోతున్నాయి. ఐఎస్పిఎల్ మ్యాచ్ ద్వారా గల్లి క్రికెట్ కు స్టేడియంలో జరిగే ప్రొఫెషనల్ క్రికెట్ కు మధ్య ఉన్న గ్యాప్ ను ఫిల్ చేయబోతున్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన క్రికెటర్లకు ఈ లీగ్ సెలక్షన్ లో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తున్నారు. www.ispl-t10.com వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఈ లీగ్ లో మీ పేరును రిజిస్టర్ చేసుకోవాలి.

- Advertisement -

ఇక ఐఎస్పిఎల్ లో హైదరాబాద్ జట్టుకు రాంచరణ్ యజమాని అయినట్టే ఇతర టీంలకు కూడా స్టార్ హీరోలు యజమానులుగా ఉన్నారు. బెంగుళూరు జట్టును హృతిక్ రోషన్, ముంబై జట్టును బిగ్ బి అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ శ్రీనగర్ జట్టును కొనుగోలు చేశారు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు