The Girl Friend : రష్మిక బర్త్ డే గిఫ్ట్ సిద్ధం

The Girl Friend : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలద్రొక్కుకోవడానికి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్క టైం నడుస్తూ ఉంటుంది. కొందరు కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితం అవుతారు. ఇంకొందరు వరుస అవకాశాలను అందుకుని ఇండస్ట్రీలో నిలబడిపోతారు. కొన్నిసార్లు ఒక సూపర్ హిట్ సినిమా పడినా కూడా అవకాశాలు అంత ఈజీగా రావు. కొన్నిసార్లు మొదటి సినిమా డిజాస్టర్ అయినా కూడా వరుసగా అవకాశాలు వస్తూనే ఉంటాయి. దీనికి మంచి ఉదాహరణ శ్రీ లీలా అని చెప్పొచ్చు.

ఇకపోతే ఒకప్పుడు టాప్ హీరోయిన్స్ అంటే నయనతార, త్రిష, అనుష్క వంటి పేర్లు వినిపించేవి. అంతకుముందు భూమిక, శ్రేయ వంటి హీరోయిన్స్ చాలామంది కుర్రకారును ఆకట్టుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం మీనాక్షి చౌదరి, శ్రీ లీల, రష్మిక, మ్రుణాల్ వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సాధించుకున్న నటి రష్మిక.

2016లో కిరాక్ పార్టీ సినిమాతో కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక 2018లో వెంకీ కుడుముల దర్శకుడుగా పరిచయమైన ఛలో సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఘనవిజయాన్ని సాధించింది. ఆ తర్వాత చేసిన గీతగోవిందం సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు దాదాపు 100 కోట్ల వరకు బాక్సాఫీస్ వద్ద వసూలు చేసింది ఈ సినిమా. అప్పటికే విజయ్ దేవరకొండ కి అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషనల్ హిట్ సినిమా పడటం ఈ సినిమాకి బాగా కలిసి వచ్చింది.

- Advertisement -

ఇకపోతే అక్కడతో మొదలైన వీరిద్దరి పరిచయం ఇప్పుడు ప్రేమ వరకు దారి తీసిందని కొన్ని కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే వీటికి సంబంధించిన అధికారికి ప్రకటన వీరిద్దరి నుంచి ఇప్పటివరకు రాలేదు. కానీ ఇద్దరు ఒకే లొకేషన్ లో దిగిన వేర్వేరు ఫోటోలు మాత్రం వైరల్ అవుతూ వచ్చాయి. ఇంకా తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న రష్మిక కి పుష్ప సినిమా మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పొచ్చు. పుష్ప సినిమాతోనే పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును తెచ్చుకుంది రష్మిక.

కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా ఇళయ దళపతి విజయ్ సరసన వారసుడు సినిమా చేసి అక్కడ కూడా మంచి గుర్తింపును సాధించుకుంది. ఇకపోతే రీసెంట్ గా వచ్చిన సెన్సేషనల్ ఫిలిం అనిమల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో ఈ సినిమా ఒక సంచలనానికి తెరతీసింది ఈ సినిమాతో రష్మిక కి విపరీతమైన గుర్తింపు లభించింది.

ఇకపోతే ప్రస్తుతం రష్మిక పుష్ప2 సినిమాలో పనిచేస్తుంది. దీనితోపాటు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో కూడా రష్మిక నటిస్తుంది. ఏప్రిల్ 5న రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక అభిమానులకు ఇది మంచి ఆనందాన్ని ఇచ్చే విషయం అని చెప్పొచ్చు. రాహుల్ రవీంద్రన్ మన్మథుడు -2 తరువాత చేస్తున్న సినిమా ఇది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు