Nikhil siddharth: స్పై 2డేస్ లెక్క..పర్లేదు కానీ?

నిఖిల్ సిద్ధార్థ్ నటించిన “స్పై” సినిమా వరల్డ్ వైడ్ గా జూన్29న విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ డే భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. స్పై సినిమా విడుదలైన మొదటిరోజు ప్రపంచ వ్యాప్తంగా 6.02 కోట్ల రూపాయల షేర్ ని వసూలు చేసింది. అంతే కాదు ఈ సినిమా నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకోవడం విశేషం.

తాజాగా స్పై సినిమా 2డేస్ కలెక్షన్స్ వివరాలు వచ్చాయి. మొదటి రోజు భారీ కలెక్షన్లు రాబట్టినా రెండో రోజు వర్కింగ్ డే ఇంపాక్ట్ వల్ల పెద్దగా జోరు చూపించలేకపోయింది ఈ చిత్రం. అయినప్పటికీ డీసెంట్ గానే హోల్డ్ చేసిందని చెప్పాలి. ఇక స్పై రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.40 కోట్ల షేర్ ని రాబట్టగా, వరల్డ్ వైడ్ గా 1.86కోట్ల షేర్ ని వసూలు చేసింది. ఇక “స్పై” చిత్రం వరల్డ్ వైడ్ గా 7.88 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది.

స్పై సినిమా 18.50 కోట్ల టార్గెట్ తో విడుదల కాగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా 10.62 కోట్లు కావాలి. ఇక ఈ వీకెండ్ హాలిడే లో స్పై మంచి జోరు చూపించే అవకాశం ఉంది. అయితే దీనికి పోటీగా రిలీజ్ అయిన సామాజవరగమన సినిమా నుంచి గట్టిపోటీ కూడా ఉండనుందని తెలుస్తుంది. ఎందుకంటే ఒకేరోజు విడుదలైన ఈ సినిమాల్లో సామజవరగమన మంచి క్లీన్ హిట్ టాక్ సొంతం చేసుకుంటే, స్పై కి మాత్రం మిక్సడ్ రెస్పాన్స్ లభించింది. మరి ఈ వీకెండ్ లో ఏ సినిమా ఎక్కువ జోరు చూపిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు