Sarkaru Vaari Paata Review: సర్కారు వారి పాట రివ్యూ

గత కొద్దీ రోజులుగా సినీ ప్రేమికులు, మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న సినిమా “సర్కారు వారి పాట”. టీజర్, సాంగ్స్ , ట్రైలర్ తో ఎన్నో అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా నేడు విడుదలైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస మెసేజ్ ఓరియంటెండ్ సినిమాలు చేస్తున్న తరుణంలో వింటేజ్ మహేష్ బాబును బయటకు తీసే ప్రయత్నంలో “సర్కారు వారి పాట” సినిమాను చేసాడు దర్శకుడు పరశురామ్. మరి ఈ సినిమాతో ఎంతవరకు ఆకట్టుకున్నాడో ఇప్పుడు చూద్దాం.

కథ :
మహేష్ (మహేష్ బాబు) యూఎస్‌లో “మహి ఫైనాన్స్ కార్పొరేషన్” అనే ఫైనాన్స్ బిజినెస్ రన్ చేస్తుంటాడు. తన దగ్గర అప్పు తీసుకున్నవాడు చెల్లించకపోతే దానిని వసూలు చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. అలాంటి మహేష్ ను మోసం చేసి కళావతి (కీర్తి సురేష్) అతని దగ్గర అప్పు తీసుకుంటుంది. మహేష్ దగ్గర తీసుకున్న డబ్బును కీర్తి తిరిగి చెల్లించిందా.? అమెరికాలో బిజినెస్ చేసుకుంటున్న మహేష్
ఇండియాకి రావాల్సిన అవసరం ఏంటి.? వీటి మధ్యలో సముథ్రకని పాత్ర ఏమిటి.? సముథ్రకని కి మహేష్ కి మధ్య అసలు గొడవ ఏంటి అని తెలియాలి అంటే ఈ సినిమాను వెండితెరపై వీక్షించాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :
భారీ అంచనాలతో మధ్య వచ్చిన ఈ సినిమాలో ఒకవైపు మహేష్ బాబు కామెడీ టైమింగ్ తో నవ్విస్తూనే అటు యాక్షన్ తోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా మహేష్ బాబు నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో అలాంటి సినిమానే అందించాడు పరశురామ్. మహేష్ కేరక్టరైజేషన్ లో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.

- Advertisement -

ఈ సినిమాలో ఇంటర్వల్ ఎపిసోడ్, మహేష్ – కీర్తి సురేష్ మధ్య వచ్చే లవ్ సీన్స్, కొన్ని కామెడీ సీన్స్. పరుశురామ్ మార్క్ కామెడీ పంచ్‌ లు, వీటన్నింటిని మించి థమన్ మ్యూజిక్ , మది సినిమాటోగ్రఫీ అన్ని బాగానే వర్కౌట్ అయ్యాయి అని చెప్పొచ్చు.

మైనస్ పాయింట్స్ :
సినిమా ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ అఫ్ కొంచెం తగ్గింది అని చెప్పొచ్చు. మాములుగా మహేష్ బాబు సినిమాలో ఉండే మెసేజ్స్ కూడా ఈ సినిమాలో కొంతమేరకు ఉన్నాయ్, కాకపోతే అవి మునుపటి సినిమాల్లో ఉన్నంత స్థాయిలో లేవు కాబట్టి అది కొంత ఆనందించాల్సిన విషయమే. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఎమోషనల్ గా ఉన్న అవి ఆడియన్స్ కి అంతలా కనెక్ట్ అవ్వలేదు.

ఓవరాల్ గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాకపోయినా మహేష్ అభిమానులకి ఒక మాస్ ట్రీట్ అని చెప్పొచ్చు.

రేటింగ్: 2.75/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు