ఆర్ఆర్ఆర్.. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ సినీ ప్రపంచాన్నే ఊపు ఊపేసింది. సినీ ప్రేమికులు ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబోలో వచ్చిన ఈ మూవీ మేనియా ఇంకా నడుస్తూనే ఉంది. మార్చి 25న విడుదలైన ఆర్ ఆర్ ఆర్ రికార్డుల వేటనూ కొనసాగిస్తూనే ఉంది.
ఈ మూవీ 1,150 కోట్ల రూపాయల కలెక్షన్లు చేసి, దేశంలో అత్యధిక వసూళ్లు చేసిన నాలుగో మూవీగా నిలిచింది. అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు, ఓటీటీలోకి వస్తుందా అని సినీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ టీం ఓటీటీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం జీ 5 లో ఈ నెల 20 నుండి ట్రిపుల్ ఆర్ ప్రసారం కానుందని తెలిపారు.
ఇప్పటి వరకు థియేటర్స్ లో రికార్డులు సృష్టించిన ఈ మూవీ, ఇక ఓటీటీ రికార్డుల వేటకు రెడీ అయింది.