విజయ్ మాల్యా కథకి – పరశురామ్ స్క్రీన్ ప్లే

టాలీవుడ్ లో చిన్న హీరోల సినిమాల నుండి పెద్ద హీరోల సినిమాల వరకు స్టోరీలు లీక్ అవుతూనే ఉన్నాయి. తాజా గా సూపర్ స్టార్ మహేష్ బాబు.. సర్కారు వారి పాట మూవీ కూడా లీక్స్ బారిన పడింది. ఈ మూవీ కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ స్టోరీ వైరల్ అవుతుంది. దీని ప్రకారం..

హీరో మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. తండ్రి లక్ష రూపాయిల లోన్ తీసుకుంటాడు. అయితే హీరో తండ్రి ఆ అప్పును కట్టలేక ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో హీరో.. అమెరికాకు వెళ్లి బాగా
సంపాదిస్తూ అక్కడున్న తెలుగు వాళ్లకి వడ్డీకి డబ్బులిస్తుంటాడు.

ఈ క్రమంలోనే అనుకోకుండా కీర్తి సురేష్ (కళావతి) తో మహేష్ పరిచయం ఏర్పడుతుంది. ఏర్పడిన పరిచయంతో కళావతి, మహేష్ దగ్గర లోన్ తీసుకుంటుంది. కానీ లోన్ తిరిగి ఇవ్వకుండా.. మహేష్ బాబును ఇబ్బంది పెడుతుంది. మహేష్ గట్టిగా అడిగే క్రమంలో, తన తండ్రి సముథ్రకని (విలన్) పెద్ద వ్యాపారి తన వద్ద తీసుకొమ్మని హీరోకు చెబుతుంది.

- Advertisement -

హీరో విలన్ దగ్గరికి లోన్ వసూల్ చేయడానికి వెళ్తాడు. అప్పులు తీసుకుని ఇవ్వకుండా ఉండటమే సముథ్రకని నైజం. అయితే సముథ్రకనికి , హీరో తండ్రి కి మధ్య ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సముథ్రకని లాంటి వాళ్ళ వల్లే తన తండ్రిని కోల్పోయానని గ్రహించిన హీరో ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నదే ఈ సినిమా కథ.

కథను పరిశీలిస్తే ఈ సినిమా విజయ్ మాల్య ను ఆధారంగా చేసుకుని పరశురామ్ స్టోరీ రెడీ చేశాడని తెలుస్తుంది. సముథ్రకని పాత్ర మొత్తం విజయ్ మాల్య నుంచే తీసుకున్నట్టు టాక్ నడుస్తుంది. వేల కోట్లు ఎగ్గొట్టిన విజయ్ మాల్య లాగే, ఈ మూవీలో సముథ్రకని కూడా లోన్స్ తీసుకుని చెల్లించడు.

విజయ్ మాల్య నిజ జీవిత కథకు కాస్త మెరుగులు దిద్ది డైరెక్టర్ పరశురామ్ సర్కారు వారి పాటను తెరకెక్కించాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఈ స్టోరీ.. నిజమా..? కాదా..? తెలియాంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు