OTT : “జయమ్మ” వచ్చేస్తుంది

బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కనకాల, “జయమ్మ పంచాయితీ” సినిమాతో ఇటీవల సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన విషయం తెలిసిందే. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, గత నెల 6వ తేదీన థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెండి తెరపై చాలా గ్యాప్ తర్వాత సుమ కనిపించడంతో ఈ సినిమాపై అంచనాలు కాస్త ఎక్కవగానే ఉన్నాయి.

అయితే “జయమ్మ పంచాయితీ” విడుదల సమయంలో విశ్వక్ సేన్ “అశోక వనంలో అర్జున కళ్యాణం”తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమాలు ఉన్నాయి. ప్రేక్షకులు మొదటి ఛాయిస్ మహేష్ సినిమా, రెండో ఛాయిస్ విశ్వక్ సేన్ సినిమాకు ఇచ్చారు. దీంతో సుమ సినిమాకు ప్రేక్షకులు, థియేటర్స్ లేకుండా పోయాయి. దీని వల్ల చాలా మంది ఈ సినిమాను థియేటర్స్ లో మిస్ అయ్యారు.

అలా థియేటర్స్ లో మిస్ అయిన ప్రేక్షకులు, ఈ సినిమా ఓటీటీలకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా రేపటి నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. దాదాపు 5 వారాల తర్వాత జయమ్మ పంచాయితీ ఓటీటీ బాట పట్టడానికి సిద్ధమైంది. స్టార్ హీరోల సినిమాలైనా, మూడు లేదా నాలుగు వారాల్లో ఓటీటీలోకి వస్తాయి. కానీ సుమ కనకాల సినిమా మాత్రం ఇన్ని రోజులు స్ట్రీమింగ్ కాకుండా, సినీ లవర్స్ ను ఎదురు చూసేలా చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు