Chor Bazaar : చోర్ బజార్ రిలీజ్ డేట్ ఫిక్స్

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలు పెట్టి, చాలా చిన్న ఏజ్ లోనే తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు పూరి తనయుడు ఆకాష్ పూరి.
బుజ్జిగాడు,చిరుత,బిజినెస్ మేన్ లాంటి సినిమాలలో కనిపించి మంచి మార్కులు పొందాడు.

తాను హీరోగా పూరి దర్శకత్వంలో చేసినా మెహబూబా సినిమా అనుకున్న ఫలితం ఇవ్వలేదు,కానీ ఆకాష్ కు మాత్రం మంచి పేరును తీసుకొచ్చింది. ఆ తరువాత వచ్చిన “రొమాంటిక్” కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ ఈ సినిమాలో ఆకాష్ పూరి ఇచ్చిన పెర్ఫార్మన్స్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఈ సినిమా చూసిన చాలామంది దర్శకులు ఆకాష్ పై ప్రశంసల జల్లు కురిపించారు.

ప్రస్తుతం ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న సినిమా చోర్ బజార్.
ఈ సినిమాకి జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తనకంటూ ఒక మార్కు క్రియేట్ చేసుకున్నాడు జీవన్ రెడ్డి.

- Advertisement -

ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఈనెల 24న థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది.

లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న చోర్ బజార్ సినిమా ట్రైలర్ ఇటీవల బాలకృష్ణ చేతులమీదుగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.
మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు