Tollywood: డిజిటల్ డీల్స్ డోర్స్ క్లోజ్… రిస్క్ లో రెండు సంక్రాంతి సినిమాలు

Tollywood: ఓటిటి ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వచ్చిన డిజిటల్ రైట్స్ డీల్స్ ద్వారా నిర్మాతలు తమ సినిమాల రిలీజ్ కు ముందే లాభాలను జేబులో వేసుకుంటున్నారు. అయితే ఈసారి సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాలకు మాత్రం డిజిటల్ రైట్స్ విషయంలో కష్టాలు తప్పేటట్టుగా కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ డిజిటల్ డీల్స్ డోర్స్ క్లోజ్ చేస్తున్నాయి. దీంతో సంక్రాంతికి రిలీజ్ కాబోయే రెండు సినిమాలు రిస్క్ లో పడ్డాయి. మరి ఆ రెండు సినిమాలు ఏమిటి అనే వివరాల్లోకి వెళ్తే…

2024 సంక్రాంతి కానుకగా ఈసారి ఏకంగా ఐదు సినిమాలు రాబోతున్నాయి. అయితే ఈ ఐదు సినిమాల్లో అన్నింటికంటే ఎక్కువ క్యూరియాసిటీ ఉన్న మూవీ “గుంటూరు కారం”. ఈ మూవీ టీం అన్ని ప్లాన్ ప్రకారం చేసుకుంటూ సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతున్నారు. ఇక సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న మిగతా నాలుగు సినిమాలు తేజ సజ్జ “హనుమాన్”, విక్టరీ వెంకటేష్ “సైంధవ్”, కింగ్ నాగార్జున “నా సామి రంగా”, మాస్ మహారాజా రవితేజ “ఈగల్”. ఇందులో “హనుమాన్” మూవీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది.

ఇప్పటికే ఈ సినిమాతో పాటు గుంటూరు కారం, సైంధవ్ సినిమాలకు సంబంధించిన డిజిటల్ డీల్స్ రైట్స్ అన్ని సోల్డ్ ఔట్ అయిపోయాయి. కానీ “నా సామి రంగా”, “ఈగల్” సినిమాలు ఇప్పుడు రిస్క్ లో పడ్డాయి. ఈ రెండు సినిమాలకు సంబంధించిన డిజిటల్ రైట్స్ డీల్స్ ఇంకా క్లోజ్ కాలేదని సమాచారం. ఒకవేళ ఈ నిర్మాతలు ఇప్పుడు తొందరపడ్డా డీల్స్ క్లోజ్ అయ్యే పరిస్థితి లేదు. మరో మూడు నెలల వరకు ఈ మూవీ డిజిటల్ డీల్స్ ను క్లోజ్ చేయడం కష్టమే.

- Advertisement -

ప్రస్తుతం రిలయన్స్ జియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో ఒప్పందం కుదుర్చుకోవడానికి రెడీగా ఉంది. ఈ మర్జింగ్ ప్రక్రియ ప్రస్తుతం చివరి దశలో ఉంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఇప్పటికి అన్ని కొత్త సినిమాల డీల్స్ ను హోల్డ్ లో పెట్టేసింది. రాబోయే 2-3 నెలల వరకు డిస్నీ వాళ్లు ఏ సినిమాల డిజిటల్ డీల్స్ కు సంబంధించిన ఒప్పందాలను చేయలేరు. ఫిబ్రవరి నెలలోగా రిలయన్స్ జియోతో డిస్నీ మర్జింగ్ ప్రక్రియ పూర్తి కాబోతోంది. ఆ తర్వాతే వాళ్లు రంగంలోకి దిగుతారు. ఇక మిగిలింది నెట్ ఫ్లిక్స్, అమెజాన్. నెట్ ఫ్లిక్స్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఈ ఓటిటి కొత్త సినిమాల రైట్స్ ను కొనుగోలు చేయకూడదని డిసైడ్ అయ్యింది.

వీళ్లకు సంబంధించిన కొత్త బడ్జెట్ 2024లో కేటాయించబడుతుంది. ఇక అమెజాన్ ది సైతం సేమ్ ఇదే పరిస్థితి. ఈ ఓటిటి సంస్థలు బడ్జెట్ ను పరిగణలోకి తీసుకుని 2024 మార్చి తర్వాతే డిజిటల్ మార్కెట్ ను ఓపెన్ చేస్తాయి. మిగిలిన ఓటిటిలు ఆహా, ఈటీవీ విన్ కేవలం చిన్న సినిమాలకు మాత్రమే పరిమితం. దీంతో ఈ మూడు నెలల్లో విడుదల కాబోతున్న పెద్ద సినిమాలకు రిస్క్ తప్పదని చెప్పాలి. ఇప్పటికే డిజిటల్ డీల్స్ క్లోజ్ చేసుకున్న సినిమాలు హాయిగా థియేటర్లలోకి వచ్చేస్తాయి. కానీ డీల్స్ ఇంకా క్లోజ్ కానీ సినిమాల పరిస్థితి ఏంటో మరి.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు