Mahesh: మహేష్ – రాజమౌళి మూవీకి మూడేళ్లు తప్పవా.. కారణం ఇదే..!

Mahesh: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో కలిసి గుంటూరు కారం సినిమాని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ రాజమౌళితో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ సినిమాని కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ చిత్రంగా తెరకెక్కించబోతున్నారు. RRR సినిమా తర్వాత రాజమౌళి క్రేజ్ అమాంతం పెరిగిపోవడంతో మహేష్ తో చేసే మూవీపై కూడా అంచనాలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలోని మహేష్ తో ఒక అడ్వెంచర్ మూవీని తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నారని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.

రాజమౌళి సినిమా అంటే కచ్చితంగా హీరోలు ఏళ్లకు ఏళ్లు తమ డేట్స్ ని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే మహేష్ బాబు కూడా దాదాపుగా మూడు ఏళ్ల పాటు తన డేట్స్ ని రాజమౌళికి ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా రాసిన కథని ఫైనల్ చేశారని.. మహేష్ తో కలిసి డిస్కషన్ కూడా చేశారని.. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్ళబోతుందని తెలుస్తోంది. బాహుబలి లాగే ఈ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

మొదటి భాగం కోసం దాదాపుగా మూడేళ్లు టైం తీసుకుంటున్నారని.. అంటే వచ్చే ఏడాది నుంచి 2027 వరకు ఈ ప్రాజెక్టు మొదటి భాగం చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇక రెండవ భాగానికి రెండేళ్లు సమయం అంటే 2029లో రాజమౌళి సినిమా కోసం డేట్స్ ఇవ్వనున్నారట. మొత్తం మీద మహేష్ బాబు ఐదారేళ్లపాటు తన డేట్ లను రాజమౌళి కి ఇచ్చారని చెప్పవచ్చు..RRR మిస్సయిన మరిన్ని అవార్డులను కూడా మహేష్ బాబు సినిమాతో సంపాదించుకోవాలని రాజమౌళి ప్రయత్నిస్తున్నారని.. అందుకే ఇన్ని సంవత్సరాలు ఒక్క చిత్రానికి టైం తీసుకుంటున్నారు.

- Advertisement -

తెలుగు సినిమాలతో సూపర్ స్టార్ క్రేజ్ సంపాదించుకున్న మహేష్ బాబు కచ్చితంగా ఈ సినిమా అభిమానులనే కాకుండా ఇండియన్ సినీ ఆడియన్స్ ను కూడా గర్వంగా తలెత్తుకునేలా చేస్తుందని రాజమౌళి అలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ కూడా రాజమౌళి సినిమాలకు కావలసిన బాడీ షేప్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారట .త్వరలోనే ఈ సినిమాకు కావాల్సిన వర్క్ షూట్ కూడా మొదలవుతుందని తెలుస్తోంది.. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ మూవీగా మహేష్ బాబు 29వ చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు