Bigg Boss: బిగ్ బాస్ లవర్స్ కి ఊహించని దెబ్బ.. రద్దు అయినట్టేనా..?

Bigg Boss: బుల్లితెరపై వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఇప్పటికే 7 సీజన్లను పూర్తి చేసుకుంది. ఇకపోతే బిగ్ బాస్ రియాల్టీ షో కి ఎంత పాపులారిటీ ఉందో ఇప్పుడు అదే సమయంలో వివాదాలకు కూడా కేంద్ర బిందువు అవుతుంది. ఇప్పటివరకు ఆరు సీజన్లు పూర్తికాగా ఏ సీజన్లో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. తాజాగా సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే రోజు అల్లర్లు చోటు చేసుకున్న నేపథ్యంలో షో యొక్క రెపుటేషన్ కూడా పోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు బిగ్ బాస్ షో ఆపివేయాలన్న వారికి ఈ విషయం మరింత బలం చేకూరిందని చెప్పవచ్చు.

వాస్తవానికి ఈ సారి బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉల్టా ఫుల్టా అంటూ భారీ సక్సెస్ తో అద్భుతమైన టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోయింది. అయితే మేకర్స్ ఆనందాన్ని ఈ వివాదాలు ఆవిరి చేశాయని చెప్పవచ్చు. ఇకపోతే ఈ షో ఎంత సక్సెస్ అయిందో అదే స్థాయిలో వివాదాలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా కామన్ మ్యాన్ క్యాటగిరి లో వచ్చిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అవ్వడమే కాదు అరెస్టు కూడా అయ్యాడు. దీంతో షో పరువు మొత్తం పోయింది. ఇక పోలీసుల ఆంక్షలు పట్టించుకోకుండా ర్యాలీ చేసిన పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అవడం తో కోర్టు రిమాండ్ విధించింది. అనంతరం బెయిల్ పై విడుదలయ్యాడు. అలాగే పల్లవి ప్రశాంత్ అభిమానులు అల్లర్లకు పాల్పడుతూ ఇతర కంటెస్టెంట్ల వాహనాల పైన దాడి చేసి పబ్లిక్ ప్రాపర్టీని కూడా నాశనం చేశారు.

అన్నపూర్ణ స్టూడియో వద్ద అల్లర్లకు పాల్పడిన వ్యక్తులను సీ సీ టీవీ ఫుటేజ్ ఆధారంగా అరెస్టు చేయడం జరిగింది. ఇంకా కొంతమందిని అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ నిర్వహకులు కఠిన నిర్ణయం తీసుకున్నారు . ఇకపై బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎలాంటి ర్యాలీలు నిర్వహించకుండా ముందే అగ్రిమెంట్ చేసుకోబోతున్నారట. కంటెస్టెంట్గా ఎంపికైన వారికి ఈ మేరకు గట్టి సూచనలు ఇవ్వనున్నారని సమాచారం. ఇకపోతే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు, విన్నర్ , ఫైనలిస్ట్ ఎవరు కూడా ర్యాలీలు నిర్వహించకూడదని, అన్నపూర్ణ స్టూడియో వద్దకు అభిమానులు కలవడానికి రాకూడదని కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

- Advertisement -

ఇక బిగ్బాస్ నిర్వహణకులకు కూడా పోలీసులు గట్టిగా ఇదే విషయంపై చెప్పినట్లు తెలుస్తోంది. ఇక కంటెస్టెంట్స్ ర్యాలీలు చేయకుండా చూసుకోవాలని నిర్వాహకులకు పోలీసులు గట్టిగా చెప్పనున్నారట. ఈ మేరకు ఒక వాదన తెరపైకి వచ్చింది. ఇకపోతే అభిమానులు తమ అభిమాన కంటెస్టెంట్ ని కలవాలి అంటే ఇకపై వారి ఇంటికి వెళ్లాల్సిందే. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే నెక్స్ట్ సీజన్ వరకు ఎదురు చూడాల్సిందే.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు