Tamannah: ఆ స్టార్ హీరోయిన్‌పై మిల్క్ బ్యూటీ కేసు ..?

Tamannah :మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి ఇండియన్ సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి ఇండియావ్యాప్తంగా సూపర్ క్రేజ్ ని సంపాదించుకుంది. చూస్తుండగానే ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లు దాటిపోయింది. 18 ఏళ్లుగా తెలుగు, తమిళ్, హిందీ, భాషల్లో అగ్ర కథానాయికగా రాణిస్తుంది తమన్న.

ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో ముఖ్యమైన పాత్రలలోనూ, కీలక పాత్రలలో, అలాగే ఐటెం సాంగ్ లలో కూడా నటించింది. అయితే ప్రస్తుతం తమన్నాకి తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. కానీ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో ఓ హీరోయిన్ తో బాగా క్లోజ్ గా మూవ్ అయ్యింది తమన్నా. ఆమెతో కలిసి ఓ సినిమాలో కూడా నటించింది.

ఆ సమయంలోనే ఆ హీరోయిన్ కి ఫైనాన్షియల్ పొజిషన్ బాలేకపోవడంతో ఆమెకి ఐదు కోట్లు అప్పుగా ఇచ్చిందట తమన్న. అయితే అప్పుగా ఇచ్చి సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ ఆ హీరోయిన్ ఈమెకి ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించలేదట. ఇటీవల తమన్నా నెంబర్ ని కూడా బ్లాక్ చేసిందట ఆ హీరోయిన్. దీంతో ఇప్పుడు ఆ హీరోయిన్ పై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి తమన్న సిద్దపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

- Advertisement -

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు