RC17: చరణ్‌తో ముచ్చటగా మూడో సారి… కాజల్‌ తర్వాత ఈ హీరోయినే..?

రామ్ చరణ్ ఇప్పుడు గేమ్ ఛేంజర్ మూడ్‌లో ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రొడ్యూసర్ దిల్ రాజే చెప్పాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ చేస్తున్న సినిమా కాబట్టి హిట్ పక్కా అని చెప్పుకొవచ్చు. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ చేయబోతున్న మూవీకి దర్శకుడు బుచ్చిబాబు.

Rc17 అనే వర్కింగ్ టైటిల్‌తో ఇప్పటికే బుచ్చిబాబు ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం సినిమాలో కాస్టింగ్‌ను ఎంచుకునే పనిలో ఉన్నారు. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని టాక్ ఉంది. అందులో ఒకరు జాన్వీ కపూర్ ఫిక్స్ అయినట్టు చాలా రోజుల నుంచి వినిపిస్తుంది. ఇక మరో హీరోయిన్ గురించి బుచ్చిబాబు అండ్ టీం సెర్చ్ చేస్తున్నారట. సెకండ్ హీరోయిన్ గా కూడా బాలీవుడ్ బ్యూటీనే తీసుకోవాలనే ఆలోచన ఉందట.

దీంతో.. ఇప్పటికే రామ్ చరణ్‌తో నటించిన, నటిస్తున్నా.. కియారా అద్వాణీని బుచ్చిబాబు సంప్రదించారని, కథ నచ్చడంతో పాటు రామ్ చరణ్‌తో అనడంతో వెంటనే కియారా గ్రిన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. కాగా, కియరా ఇప్పటికే రామ్ చరణ్‌తో వినయ విధేయ రామతో పాటు ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా చేస్తుంది. RC17లో కియారా ఫిక్స్ అయితే.. రామ్ చరణ్ తో మూడు సినిమాల్లో నటించినట్టు అవుతుంది.

- Advertisement -

రామ్ చరణ్ సాధారణంగా కొత్త హీరోయిన్స్ తోనే చేస్తాడు. ఇప్పటి వరకు హీరోయిన్స్ రిపీట్ అయ్యారంటే.. అది కాజల్ అగర్వాల్, కియారా అద్వాణి మాత్రమే. కాజల్ అగర్వాల్.. రామ్ చరణ్ తో మగధీర, నాయక్ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. అలాగే ఎవడు సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించింది. ఇక ఇప్పుడు కియారా ఇప్పటికే రెండు సినిమాల్లో రామ్ చరణ్ పక్కన నటించింది ఇప్పుడు RC17 పై వార్తలు వస్తున్నాయి.

కాగా RC17 పక్క విలేజ్ బ్యాగ్రౌండ్‌లో సాగే స్టోరీ అది కూడా కబడ్డి ఆట నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చి హిట్ కొట్టిన సినిమాలు చాలా ఉన్నాయి. బాలీవుడ్‌లో దంగల్ మూవీ క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంత కాదు. ఇప్పుడు అలాంటి అంచనాలే ఈ RC17పై ఉన్నాయి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు