Ananya Panday: నేను ఓ సైకో లేడీ.. నా లవర్‌ను టార్చర్‌ పెడతా !

Ananya Panday : బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. “స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2” సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. ఆ తరువాత “పతి పత్ని ఔర్ వహ్” లాంటి చిత్రాల్లో నటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. ఈ బాలీవుడ్ బ్యూటీ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ అమ్మడు టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ చిన్నది మళ్లీ కనిపించలేదు. అయితే ఈ బ్యూటీ తాజాగా నటించిన బాలీవుడ్ మూవీ “ఖో గయే హమ్ కహాన్” డిసెంబర్ 26న డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతోంది.

ఖాళీ పీలీ తర్వాత థియేటర్లలో కాకుండా ఓటీటీ లో విడుదల కాబోతున్న అనన్య రెండో సినిమా ఇది. ఈ మూవీ ప్రమోషన్స్ ని భారీగా నిర్వహిస్తుంది యూనిట్. ఈ క్రమంలో ఈ సినిమాలో రియల్ లైఫ్ కి దగ్గరగా ఉన్న తమ క్యారెక్టర్ లోని విశేషాలను పంచుకోవాలని ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగారు. దీనిపై స్పందించిన సిద్ధార్థ్ ఆదర్శ్.. చిత్రంలోని పాత్రకు.. నిజ జీవితానికి పోలిక లేదని తెలిపారు.

- Advertisement -

కానీ అనన్య మాత్రం తాను ఇందులో సైకో అబ్సేసివ్ స్టాకర్ గర్ల్ ఫ్రెండ్ అని.. రియల్ లైఫ్ లో కూడా ఇలాగే ఉంటానని తెలిపింది. అంతేకాదు ఇతరుల జీవితాలలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం అంటే తనకు చాలా ఇంట్రెస్ట్ అని చెప్పుకొచ్చింది. ఇలా అనన్య చేసిన కామెంట్స్ పై నెటిజెన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. పాపం ఆదిత్యా రాయ్ కపూర్ కి బాధ్యతలు బాగానే ఉన్నట్లున్నాయ్ అని కామెంట్స్ చేస్తున్నారు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు