Ayalaan Telugu OTT : ఫైనల్‌గా వచ్చేసింది… ఓటీటీలోకి వచ్చేది ఈ డేట్‌నే

Ayalaan Telugu OTT : తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ అయలాన్ తెలుగు వెర్షన్ రిలీజ్ కు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కు రంగం సిద్ధమైంది. మరి ఇంతకీ అయలాన్ ఏ ఓటీటీలో రాబోతోంది? ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతోంది? అనే వివరాల్లోకి వెళితే…

ఎట్టకేలకు సన్ నెక్స్ట్ లో అయలాన్…

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన తమిళ సినిమాల్లో అయలాన్ మూవీ కూడా ఒకటి. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 2024 సంక్రాంతికి రిలీజై, కోలీవుడ్ లోనే అత్యధిక వసూళ్లు దక్కించుకున్న మూవీగా రికార్డు క్రియేట్ చేసిన అయలాన్ 90 కోట్లకు పైగానే కలెక్షన్లను కొల్లగొట్టింది. అయితే తెలుగు వెర్షన్ రిలీజ్ విషయంలో మేకర్స్ కు ఇబ్బందులు తప్పలేదు. థియేటర్లలో మిస్సయిన ఈ మూవీ తాజాగా ఓటిటి ద్వారా తెలుగు ప్రేక్షకులను అలదించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అయలాన్ మూవీ ఓటిటి రైట్స్ ను సన్ నెక్స్ట్ దక్కించుకోగా, ఏప్రిల్ 19 నుంచి ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ తెలుగు ( Ayalaan Telugu OTT ) వెర్షన్ స్ట్రీమింగ్ కాబోతున్నట్టు తెలుస్తోంది.

తెలుగు వెర్షన్ రిలీజ్ కాకపోవడానికి రీజన్ ఇదే…

ముందుగా తమిళంలో రిలీజ్ అయిన ఈ మూవీని తెలుగులో కూడా థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు భావించారు. కానీ సంక్రాంతికి తెలుగులో స్టార్ హీరోల సినిమాలు బరిలో నిలవడంతో ఆ పోటీ కారణంగా అయలాన్ రిలీజ్ లేట్ అయ్యింది. రెండు వారాలు ఆలస్యంగా తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేయబోతున్నట్టు అప్పట్లో మేకర్స్ ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా భారీగా చేశారు. శివ కార్తికేయన్ హైదరాబాద్ కు వచ్చి మరీ ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. కానీ వీఎఫ్ఎక్స్ సమస్యల కారణంగా ఈ మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ వాయిదా పడక తప్పలేదు. నిర్మాతలకు, ఈ మూవీకి వీఎఫ్ఎక్స్ వర్క్ చేసిన షారుఖ్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ కు మధ్య నెలకొన్న విబేధాలు కారణం అని టాక్ నడిచింది.

- Advertisement -

నిజానికి ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ మూవీ థియేటర్లలోకి వస్తుందని నిర్మాతలు ప్రకటించారు. తమిళంలో అయలాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఆశగా థియేటర్లోకి అడుగు పెట్టారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా మొదటి షోలే క్యాన్సిల్ అయ్యాయి. పలు కారణాల వల్ల అప్పుడు వాయిదా పడ్డ ఈ మూవీ తెలుగు వెర్షన్ ఇప్పటిదాకా కనీసం ఓటీటీ లో కూడా రిలీజ్ కు నోచుకోకపోవడం గమనార్హం. తెలుగు వెర్షన్ కు సంబంధించిన డబ్బింగ్ పనులన్నీ పూర్తయ్యాయి. కానీ అటు థియేటర్లు, ఇటు ఓటిటిలో అయలాన్ మూవీ తెలుగు వెర్షన్ మాత్రమే రిలీజ్ కాలేదు.

ఎనిమిదేళ్లు షూటింగ్… కానీ…

ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా, ఏలియన్ పాత్రకు హీరో సిద్ధార్థ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. శివ కార్తికేయన్ తో పాటు సిద్ధార్థ కూడా అయలాన్ మూవీ కోసం రెమ్యూనరేషన్ తీసుకోకుండా పని చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ షూటింగ్ దాదాపు 8 ఏళ్లు జరిగింది. 2016లో అనౌన్స్ చేయగా పలు అడ్డంకులను దాటుకుని 2024లో థియేటర్లలోకి వచ్చింది. అయితే ఇంత కష్టపడ్డప్పటికీ తెలుగు వెర్షన్ ను మాత్రం బిగ్ స్క్రీన్ పైకి తీసుకు రాలేకపోయారు మేకర్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు