Esther Anil: హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న వెంకటేష్ చిన్న కూతురు..!

Esther Anil..ఒకప్పుడు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించి.. ఆ తర్వాత హీరో లేదా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తూ.. ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మలయాళం ఇండస్ట్రీలో చైల్డ్ యాక్టర్ గా ఎన్నో చిత్రాలలో నటించింది ఎస్తర్ అనిల్.. దృశ్యం సినిమాతో చైల్డ్ యాక్టర్ గా మంచి క్రేజ్ అందుకుంది.. అలా మలయాళం తెలుగులో కూడా నటించింది.. దీంతో తెలుగు వారికి కూడా బాగా సుపరిచితురాలు అయ్యింది ఎస్తర్ అనిల్.. దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురు పాత్రలో ఎస్తర్ అనిల్ అద్భుతంగా నటించింది.. దాదాపుగా 25 కు పైగా మళయాళం, తెలుగు, తమిళ్ సినిమాలలో కనిపించింది.. ఇప్పుడు చైల్డ్ యాక్టర్ నుంచి హీరోయిన్ గా ఎదిగింది ఈ ముద్దుగుమ్మ.. ఎస్తర్ అనిల్ ఇటీవలే కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. అలాగే జోహార్ అనే సినిమాలో కూడా నటించింది..

హీరోయిన్ గా తెలుగు ఎంట్రీ.
ఇప్పుడు హీరోయిన్ గా పలు సినిమాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో.. సోషల్ మీడియాలో కూడా పలు రకాల ఫోటోలతో మంచి క్రేజ్ అందుకుంది.. ఈ సమయంలోనే తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది.. ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు సాహిదేవ్ విక్రం హీరోగా నటిస్తున్న చిత్రంలో ఎస్తర్ అనిల్ హీరోయిన్ గా కొత్త సినిమాని సైతం ప్రారంభించింది.. గతంలో కూడా సాహిదేవ్ విక్రమ్ చైల్డ్ యాక్టర్ గా పలు చిత్రాలలో నటించారు. ముఖ్యంగా రుద్రమదేవి, రేసుగుర్రం, పటాస్ వంటి చిత్రాలలో కూడా చైల్డ్ యాక్టర్ గా నటించారు.అలాగే హీరోగా కూడా గోలి సోడా అనే ఒక కన్నడ చిత్రంతో హీరోగా మారారు. తెలుగులో ఎవడు తక్కువ కాదు, వర్జిన్ స్టోరీ
లాంటి చిత్రాలలో నటించారు.

నిర్మాతగా మారిన ధమాకా డైరెక్టర్..
ఇటీవల ధమాకా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ త్రినాధరావు నక్కిన నిర్మాణంలో ఎంవీ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ప్రొడక్షన్-2 పేరుతో తాజాగా ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా చాలా గ్రాండ్గా జరిగాయి.. సుమంత్ , సందీప్ కిషన్ ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. ఇన్ని రోజులు చైల్డ్ యాక్టర్ గా మెప్పించిన ఎస్తర్ అనిల్ ఇప్పుడు హీరోయిన్గా ఎలా మెప్పిస్తుందో అంటూ అభిమానులు చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

రెండవ సినిమాతోనే అలాంటి అవకాశం..
ఈ సినిమా మొత్తం ఆంధ్ర బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ ఎంటర్టైర్మెంట్ చిత్రంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ చిత్రంలో తారక్ పొన్నప్ప కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు.. ఈ సినిమాకి దావంద్ సంగీతాన్ని అందిస్తున్నారు.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించారు. మరి హీరోయిన్గా తను అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ రెండవ సినిమానే బడా నిర్మాత కుమారుడితో నటించడంతో మరి ఈమె దశ తిరుగుతుందేమో చూడాలి. మొత్తానికైతే ఈ సినిమా ఈమె కెరియర్ కు ప్లస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు