Fitness Tips : జిమ్ కు వెళ్ళినా కండలు పెరగట్లేదా? గోల్డీ లాక్ ట్రైనింగ్ బెస్ట్ ఆప్షన్

Fitness Tips : ఈ డిజిటల్ యుగంలో జనాలు ఫిట్ గా, అట్రాక్టివ్ బాడీని పొందడానికి జిమ్‌లో గంటల తరబడి కష్టపడుతున్నారు. ముఖ్యంగా అబ్బాయిలు కండలు తిరిగిన దేహం కోసం పాట్లు పడుతూ ఉంటారు. ఇంతకు ముందు మల్లయుద్ధం చేసే వారి శరీరాలు సహజంగా ఫిట్‌గా ఉండేవి, కానీ ఈరోజుల్లో ఎంత కష్టపడ్డా కూడా వర్కౌట్ అవ్వట్లేదు అని ఫిజిక్ గురించి ఆందోళన చెందుతున్నారు. ఫిట్‌గా ఉండడం కంటే సిక్స్ ప్యాక్ పైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. సిక్స్ ప్యాక్ రావాలంటే కండరాలకు బలం, బాడీ ఫిట్ గా ఉండడం అవసరం. కానీ జిమ్ లో ఎంత కష్టపడినా కూడా కొంత మందికి ఫలితం ఉండదు. అలాంటి వాళ్ళ కోసమే ఓ కొత్త టెక్నీక్ అందుబాటులోకి వచ్చింది. అదే గోల్డీ లాక్ ట్రైనింగ్. కండరాల బలాన్ని పెంచే కొత్త టెక్నిక్ ఇది.

గోల్డీ లాక్ ట్రైనింగ్ అంటే ఏంటి ?

కండరాల బలం పెరగాలంటే అధిక బరువును ఎత్తడం చాలా ముఖ్యం. గోల్డీ లాక్ ట్రైనింగ్ ట్రిక్ కండరాల బలాన్ని పెంచడమే కాకుండా కండల పరిమాణాన్ని కూడా పెంచుతుంది. అయితే ఇది అనుకున్నంత సులభం కాదు, ఎందుకంటే డబుల్ వెయిట్ డంబెల్స్ ఎత్తడం అనేది అందరికీ సాధ్యం కాదు. అలాగని దీన్ని గంటల తరబడి చేయవలసిన అవసరం లేదు. ట్రైసెప్స్ కోసం 1-1 కిలోల బరువుతో 10-10 ట్రైసెప్స్ మూడు సార్లు చేయండి. తరువాత 2-2 కిలోలకు తగ్గించి, 5-5 ట్రైసెప్స్ మూడు సార్లు చేయండి. దీంతో కండరాల బలం పెరుగుతుంది.

ఇలా చేస్తే సిక్స్ ప్యాక్ ఖాయం

అధిక బరువును ఎత్తినప్పుడు, కండరాల కణాలలో చిన్న మార్పులు వస్తాయని చాలా పరిశోధనలలో తేలింది. బరువులు ఎత్తినప్పుడు బ్రేక్ అయ్యే కణాలను మన శరీరం వెంటనే రిపేర్ చేయడం మొదలు పెడుతుంది. శరీరం ఈ కణాలను తయారు చేయడం ప్రారంభించినప్పుడు, మరిన్ని కొత్త కణాలు ఏర్పడటం ప్రారంభిస్తాయి, ఇది కండరాల పెరుగుదలకు దారి తీస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ కారణంగా కండరాలు పెరిగి, మరింత బలంగా మారతారు. అయితే మీరు వ్యాయామం చేసేటప్పుడు, బరువును ఎత్తినప్పుడు సరిగ్గా చేస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. చిన్న మిస్టేక్ జరిగినా తీవ్రమైన గాయం బారిన పడే అవకాశం ఉంటుంది జాగ్రత్త. దీనితో పాటు మీరు జిమ్‌లో వెయిట్ ట్రైనింగ్ చేసినప్పుడు, క్రమంగా బరువును పెంచుకోండి. ఎందుకంటే మీరు అకస్మాత్తుగా అధిక బరువును ఎత్తితే, గాయాల బారిన పడే అవకాశం పెరుగుతుంది, ఉదాహరణకు మీరు ఒక కిలో బరువును ఎత్తితే, తరువాత వారంలో దానిని ఒకటిన్నర కిలోల వరకు, ఆ తరువాత వారంలో మరింత బరువును ఎత్తండి. దీని శరీరం బరువులను ఎత్తడానికి అలవాటు పడుతుంది. నెమ్మదిగా మీ స్టామినా కూడా పెరగడం వల్ల గాయాల పాలయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం… సిక్స్ ప్యాక్ కావాలంటే ఈ గోల్డీ లాక్ ట్రైనింగ్ ను ఇప్పుడే మొదలు పెట్టండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు