Priyanka : పెళ్లి పీటలెక్కిన బిగ్ బాస్ బ్యూటీ.. వీడియో వైరల్..!

Priyanka : ఈ మధ్యకాలంలో అటు సినీ సెలబ్రిటీలు, ఇటు బుల్లితెర సెలబ్రిటీలు వివాహం చేసుకొని.. కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే సీరియల్స్ లో నటించి భారీ క్రేజ్ దక్కించుకొని బిగ్ బాస్ అవకాశాన్ని సొంతం చేసుకున్న తర్వాత. అక్కడ కూడా అభిమానులలో తమకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుని.. ఇప్పుడు మరింత పాపులారిటీ దక్కించుకుంటున్నారు.. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ ద్వారా ప్రేక్షకులను అలరించి టాప్ 5 లో నిలిచి తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్న ప్రియాంక.. తాజాగా పెళ్లి పీటలు ఎక్కింది.. తాను ప్రేమించిన వ్యక్తినే వివాహం చేసుకొని అందరికీ ఈ విషయాన్ని తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ..

పెళ్లి పీటలెక్కిన బిగ్ బాస్ బ్యూటీ..

బిగ్ బాస్ వేదికగా తన ప్రియుడిని పరిచయం చేసిన ప్రియాంక.. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ప్రియుడుతో కలిసి రకరకాల ఫోటోలు , వీడియోలు షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంది. ఇక ఈమె సడన్గా పెళ్లి పీటలు ఎక్కింది.. అలా సడన్గా తన ప్రియుడు శివ ను వివాహం చేసుకొని.. అందుకు సంబంధించిన ఒక వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో వదిలింది. మా పెళ్లి అయిపోయింది అని ఒక వీడియో రిలీజ్ చేయగా ఈ వీడియోలో తన కుటుంబ సభ్యుల సమక్షంలో తన పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది.. సడన్ గా.. రియల్లీ సారీ..మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం.. అంటూ తెలిపారు శివ.. అలాగే చాలా సంతోషంగా ఉంది.. అసలు మాటలు రావడం లేదు.. కుటుంబ సభ్యులు కలిసి మా వివాహం చేశారు.. పెళ్లి చేసుకోబోతున్నామా? పెళ్లి అయిపోయిందా? ఏంటి ఏ వీడియో కూడా పెట్టలేదని అనుకుంటున్నారా? అసలు మా పెళ్లి ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? అనే సందేహాలు కూడా మీకు వస్తూ ఉంటాయి. ఇక ఎప్పుడు? ఎక్కడ? ఎలా చేసుకున్నాం? ఏ ఊర్లో చేసుకున్నాం? మా పెళ్లికి ఎవరు వచ్చారు? ఇవన్నీ కలిపి కూడా ఒక వీడియో రిలీజ్ చేస్తాము అంటూ చెప్పుకొచ్చారు శివ.. అందరూ చెప్పి చేసుకుంటారు మేము కొంచెం క్రేజీ కాబట్టి.. ఇలా క్రేజీగా చేసుకున్నాను.. మా పెళ్ళికి అన్నీ జరిగాయి.. అవన్నీ కూడా వీడియోలను త్వరలోనే రిలీజ్ చేస్తాము అంటూ తెలిపారు..

నెటిజన్స్ ఫైర్…

అయితే ఇది చూసిన నెటిజెన్లు మాత్రం ఇది నిజం పెళ్లి కాదు.. టీవీ వాళ్ళు పండుగలకు ఇలా ఎవరో ఒకరికి పెళ్లి చేస్తారు కదా.. అలాంటిదే ఈ పెళ్లి.. ఈసారి ఉగాదికి వీరి పెళ్లి చేసి ఉంటారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.. మొత్తానికి అయితే పెళ్లి చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు ఈ జంట.. అయితే ఈ విషయంపై నెటిజన్స్ కాస్త ఫైర్ అవుతున్నారని చెప్పవచ్చు.

- Advertisement -

ప్రియాంక కెరియర్..

జానకి కలగనలేదు, మౌనరాగం వంటి సీరియల్స్ ద్వారా మంచి పేరు దక్కించుకున్న ప్రియాంక జైన్ ( Priyanka ) బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొని గేమ్ కోసం తన జుట్టుని కూడా త్యాగం చేసింది.. ఆ ఎపిసోడ్ తర్వాత ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈమె.. తన గేమ్ స్ట్రాటజీతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు సొంతం చేసుకుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 7 ఫినాలే వరకు వెళ్లి.. అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు