Bigg Boss 7 Priyanka : ప్రియుడితో పెళ్లికి సిద్ధమైన ప్రియాంక.. ఎప్పుడంటే..?

టాప్ రియాల్టీ షో తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 షో ఇటీవల ముగిసింది. అయితే ఈసారి కామన్ మ్యాన్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్ కు టైటిల్ విన్నర్ గా పట్టం కట్టారు. ఇక రన్నర్ గా సీరియల్ కంటెస్టెంట్ అమర్ దీప్ నిలిచారు. చివరి వరకు ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ప్రియాంక జైన్ కూడా ఒకరు. శివాజీ, అమర్ , ప్రశాంత్ , ప్రియాంక, యావర్, అర్జున్ ఫైనల్ కి వెళ్ళగా.. ఫైనల్ వరకు వెళ్లిన వన్ అండ్ ఓన్లీ లేడీ కంటెస్టెంట్ గా ప్రియాంక రికార్డ్ సృష్టించారు. వరుస టాస్క్లలో గట్టి పోటీ ఇస్తూ అబ్బాయిలతో పోటీపడి మరీ ఫిజికల్, మెంటల్ టాస్క్ లలో కూడా సత్తా చాటింది ఈ ముద్దుగుమ్మ.

చాలా టాస్క్ లలో చివరి వరకు వచ్చింది. ఒకసారి కెప్టెన్ కూడా అయింది. ఎక్కువగా కెమెరాల ముందు కనిపించకుండా ఉండడమే ఆమెకు మైనస్ అయిందని చెప్పవచ్చు. దీనిపై విమర్శలు వస్తున్నా కూడా వాళ్ల స్నేహం కొనసాగించారు. చివరి వారాల్లో హోస్ట్ నాగార్జున ఇదే విషయంపై ప్రియాంకను హెచ్చరించినా కూడా ఆమె తన స్నేహాన్ని వదులుకోలేదు. టైటిల్ కొట్ట లేకున్నా కూడా అభిమానుల మనసును దోచుకుంది. దాదాపు 15 వారాలు పాటు హౌస్ లో ఉన్న ఈమె మొత్తం రూ.37.5 లక్షలు రెమ్యూనరేషన్ గా తీసుకుంది.

ఇక ఈ డబ్బులతో ఆమె పెళ్లి చేసుకోబోతోంది అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. సీరియల్ నటుడు శివకుమార్ ని ఈమె ప్రేమిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు ఫ్యామిలీ వీక్ లో శివకుమార్ హౌస్ లోకి వచ్చారు.శివకుమార్ హౌస్ లో ఆమెపై ముద్దుల వర్షం కురిపించగా అదే సమయంలో పెళ్లి చేసుకుందామా అని ప్రియాంక తన ప్రియుడిని కోరింది. బయటకు వచ్చాక వివాహం చేసుకుందామని హామీ కూడా ఇచ్చారు . మరి దీంతో వీరి పెళ్లి వార్తలు మళ్లీ వైరల్ గా మారుతున్నాయి. ఇక త్వరలోనే వీరి పెళ్లి ప్రకటన వస్తుందని అభిమానుల సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ తేదీని ఎప్పుడు ప్రకటిస్తారు అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఏదేమైనా బిగ్ బాస్ ద్వారా సంపాదించిన డబ్బుతో ప్రియాంక పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు