Rashmi Gautam: తన పెళ్లి ఎప్పుడో చెప్పనున్న రష్మీ.. ముహూర్తం కూడా ఫిక్స్..!

బుల్లితెరపై యాంకరింగ్ రంగంలో భారీ పాపులారిటీ దక్కించుకొని మరింత క్రేజ్ సొంతం చేసుకున్న వారిలో సుమా, శ్రీముఖి తర్వాత రష్మీ గౌతమ్ కూడా ఒకరు అని చెప్పవచ్చు. మొదట్లో కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన రష్మీకి అంతగా గుర్తింపు రాలేదు. దాంతో ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్ లోకి వచ్చి ఇప్పుడు స్టార్ యాంకర్ గా పేరు దక్కించుకుంది. అంతేకాదు యాంకర్ గా ఫేమ్ వచ్చిన తర్వాత రష్మీకి సినిమాలలో హీరోయిన్ గా కూడా అవకాశాలు వచ్చాయి. అలా ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు యాంకరింగ్ లో కూడా దూసుకుపోతోంది.

యాంకర్ రష్మీ కెరియర్ పరంగా ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ.. పెళ్లిపై మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే మల్లెమాల యూనిట్ వారు చాలాసార్లు రష్మీకి పెళ్లి చేశారు మరీ ముఖ్యంగా సుధీర్ కి రష్మీ కి మధ్య ఏదో నడుస్తోందని ఈటీవీలో ప్రసారమయ్యే చాలా షోలలో చూపించారు కూడా. ఇక అలా బుల్లితెర మీద చాలామందికి ఫేవరెట్ జోడిగా కూడా రష్మి , సుధీర్ పేరు దక్కించుకున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని చాలామంది అనుకున్నారు. అయితే ఈ విషయంపై ఈ జంట ఎప్పటికప్పుడు స్పందిస్తూ తమ మధ్య అలాంటి రిలేషన్ లేదు అని కామెంట్లు చేసినా ఎవరు కూడా నమ్మలేదు.

అయితే తాజాగా గత కొద్ది రోజుల నుండి రష్మీ పెళ్లి చేసుకోబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించడమే కాదు… ఎక్కడ చూసినా ఈమె పెళ్లి వార్తలే అంటూ నెట్టింట వైరల్ అవుతూ ఉండగా.. ఎట్టకేలకు తన పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టు ఇండస్ట్రీలో ఒక వార్త వినిపిస్తోంది. అంతేకాదు ఆ పెళ్ళికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారనే వార్తలు మరింత వైరల్ గా మారుతున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళితే ఇయర్ ఎండింగ్లో చాలా చానల్స్ ఎన్నో రకాల ఈవెంట్లను స్టార్ట్ చేస్తారు.

- Advertisement -

అందులో భాగంగానే ఈసారి కూడా ” రష్మీ పెళ్లి పార్టీ” పేరుతో ఈవెంట్ ని చేస్తున్నారు . అయితే ఈవెంట్లో రష్మీ తన పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పబోతుందని తనకు కాబోయే భర్తకు సంబంధించిన విషయం కూడా ఈ షోలో బయట పెట్టబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ పార్టీకి సంబంధించిన ప్రోమో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ ప్రోమో ని చూసి రష్మీ నిజంగానే పెళ్లి చేసుకోబోతోందా ?అయితే ఎవరిని వివాహం చేసుకోబోతోంది? అనే అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తుంటే మరి కొంతమంది ఎప్పటిలాగే షో చూడడానికి రష్మీ పెళ్లి అని ప్రచారం చేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావాలి అంటే డిసెంబర్ 31 వరకు ఎదురు చూడాల్సిందే.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు