Shivaji: బిగ్ బాస్ ఓటమిపై మొదటి సారి స్పందించిన శివాజీ..!

ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇటీవల 7వ సీజన్ కూడా కంప్లీట్ చేసుకుంది . ఇకపోతే సీజన్ 7 కంటెంట్లను ప్రకటించిన రోజు నుంచి అందరూ కూడా శివాజీ తప్పకుండా ఈ సీజన్ విన్నర్ గా నిలుస్తారు అంటూ అనుకున్నారు. అందుకు ముఖ్య కారణం ఈసారి ప్రకటించిన హౌస్ మేట్స్ లో శివాజీకి ఎక్కువగా పాపులారిటీ ఉండడమే దీనికి ప్రధాన కారణం. ఇక మొదటి వారమే ఎలిమినేట్ అవ్వచ్చు అని అనుకున్న కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ ఏకంగా సీజన్లో అందరిని ఆశ్చర్యపరుస్తూ టైటిల్ విన్నర్ గా నిలవడం మరింత ఆశ్చర్యపరిచింది.

ఇక అమర్ దీప్ రన్నర్ గా నిలవగా.. శివాజీ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. కానీ చాలామంది ప్రేక్షకులు విన్నర్ విషయంలో సంతృప్తిగా లేనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ విన్నింగ్ పై పలువురు మోసం చేశారని కామెంట్లు వినిపిస్తూ ఉండడం గమనార్హం అంతేకాదు మరి కొంతమంది సీజన్ 2 లో జరిగినట్టుగానే ఇప్పుడు కూడా మోసం చేసి.. మేనేజ్మెంట్ ని భయపెట్టేలా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేశారు. అందుకే ఫ్యాన్స్ కి భయపడి పల్లవి ప్రశాంత్ ను విన్నర్ ను చేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఈ విషయంపై శివాజీ స్పందించారు. శివాజీ మాట్లాడుతూ.. బిగ్ బాస్ షో మేనేజ్మెంట్ నన్ను పక్కన పెట్టి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ని విన్నర్ ని చేశారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అలాంటిదేమీ అక్కడ జరగలేదు.. అంతేకాదు నేను వాటిని నమ్మను కూడా.. బిగ్బాస్ వారు ఓటింగ్ ఫార్మాట్ తోనే వారి సీజన్ విన్నర్ ని అనౌన్స్ చేస్తారు.. అలాగే ప్రశాంత్ ని విన్నర్ గా ప్రకటించారు. ఇక అందుకే విన్నర్ ఎవరో తెలిసాక నేను మరింత హ్యాపీగా ఫీల్ అయ్యాను. షో స్టార్టింగ్ లో ప్రశాంత్ బిగ్బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒకటి అనుకున్నాను.. ఇలాంటి ఒక కామన్ మ్యాన్ కి టైటిల్ సాధిస్తే చాలా బాగుంటుందని.. ఎందుకంటే నేను కూడా రైతు కుటుంబానికి చెందిన వాడిని.. యావర్ కూడా ఒక కామన్ మాన్ గానే వచ్చాడు. అందుకే మాకు స్నేహం స్నేహం కుదిరింది.. నా వరకు అయితే నాకు గేమ్ ప్లాన్స్ ఏమీ లేవు.. ఇక రైతుబిడ్డ గెలవడం చాలా సంతోషంగా ఉంది అంటూ శివాజీ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు తన వెనుక అండగా నిలిచిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. త్వరలోనే అందరిని కలుసుకుంటాను అని కూడా చెప్పుకొచ్చారు శివాజీ.

- Advertisement -

 

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు