Threequel Trend : త్వరలో తెరపైకి రాబోతున్న త్రీక్వెల్స్ ఇవే

Threequel Trend : నిన్న మొన్నటిదాకా సీక్వెల్ ట్రెండ్ నడిచింది. రాజమౌళి మొదలు పెట్టిన ఈ పద్ధతిని పెద్ద డైరెక్టర్స్ నుంచి చిన్న సినిమాల మేకర్స్ దాకా అందరూ ఫాలో అవుతూ వచ్చారు. ఇక ఇప్పుడు సీక్వెల్ ను దాటేసి త్రీక్వెల్ వైపు అడుగులేస్తున్నారు. మూవీ హిట్టయితే చాలు చిన్నా పెద్దా తేడా లేకుండా వరుసగా సీక్వెల్స్ ప్రకటిస్తూ ఫ్రాంచైజీలు, సినిమాటిక్ యూనివర్స్ లు క్రియేట్ చేస్తున్నారు. టిల్లు స్క్వేర్ క్రియేట్ చేసిన సంచలనంతో ప్రస్తుతం టాలీవుడ్ తో సహా మూవీ లవర్స్ అందరి ఫోకస్ త్రీక్వెల్ సినిమాలపై పడింది. డీజే టిల్లు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో, దానికి కొనసాగింపుగా మార్చి 29న సీక్వెల్ టిల్లు స్క్వేర్ తెరపైకి వచ్చింది. ఈ మూవీ కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండగా, త్వరలోనే మూడవ భాగం కూడా ఉంటుందని సినిమా చివర్లో అనౌన్స్ చేశారు. ఇప్పటికే పుష్ప 3 కూడా ఉంటుందని అల్లు అర్జున్ చెప్పేశారు. బాహుబలి 3 కూడా రాబోతోందని టాక్ నడుస్తోంది. దీంతో ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న త్రీక్వెల్ సినిమాలపై సినీ ప్రియుల్లో ఆసక్తి పెరిగిపోయింది. మరి త్వరలోనే తెరపైకి రాబోతున్న ఆ త్రీక్వెల్స్ ( Threequel Trend ) పై ఓ లుక్కేద్దాం.

1. టిల్లు క్యూబ్

డీజే టిల్లు కాన్సెప్ట్ కి త్వరలోనే త్రీక్వెల్ కూడా ఉంటుందనే విషయాన్ని టిల్లు స్క్వేర్ క్లైమాక్స్ లో రివిల్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. మొదటి రెండు భాగాలు థియేటర్లలో కలెక్షన్ల పరంగా దుమ్మురేపాయి. త్వరలోనే టిల్లు క్యూబ్ ను కూడా పట్టాలెక్కించబోతున్నారు మేకర్స్. టిల్లు సినిమాటిక్ యూనివర్స్ పై పేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ కూడా వేరే లెవెల్ లో ఉన్నాయి.

2. కేజిఎఫ్ 3

కన్నడ స్టార్ యష్ ఈ మూవీతో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. కేజీఎఫ్ మూవీ సైలెంట్ గా వచ్చి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. సినిమాలో రాకీ భాయ్ యాక్షన్ సీక్వెన్స్, పాటలు, డైలాగులు, హీరో ఎలివేషన్ సీన్స్… ఇలా ప్రతి ఒక్క అంశం థియేటర్లలో ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించింది. ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే వచ్చిన ఈ మూవీ నిర్మాతలకు లాభాల పంట పండించింది. ఆ తర్వాత వచ్చిన కేజిఎఫ్ 2 కూడా అదరగొట్టింది. క్లైమాక్స్ లో బంగారం అంతా తీసుకుని సముద్రంలో పారేస్తాడు రాకీ బాయ్. నెక్స్ట్ పార్ట్ లో ఈసారి ఇంటర్నేషనల్ తీరానికి కేజీఎఫ్ స్టోరీని ప్రశాంత్ నీల్ చేరుస్తాడని టాక్ నడుస్తోంది. చాలా టైం పట్టే ఛాన్స్ ఉన్నప్పటికీ కేజిఎఫ్ 3 కూడా రానుంది.

- Advertisement -

3. భారతీయుడు

కోలీవుడ్ లో కూడా త్రీక్వెల్ ట్రెండ్ మొదలైపోయింది. భారతీయుడు మూవీకి సంబంధించిన నెక్స్ట్ రెండు భాగాలు ప్రస్తుతం సెట్స్ పైనే ఉన్నాయి. తమిళ తంబీలకు త్రీక్వెల్ లోటును కమల్ హాసన్ తీర్చబోతున్నారు. ప్రస్తుతం భారతీయుడు 2 సినిమా షూటింగ్ పూర్తి కాగా, దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పనిలో పనిగా కమల్ హాసన్ భారతీయుడు 3 షూటింగ్ ను కూడా పూర్తి చేశారు. సీక్వెల్ థియేటర్లలోకి రాగానే, త్రీక్వెల్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టబోతున్నారు చిత్ర బృందం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు