Ramayanam : లాంఛనంగా పూజా కార్యక్రమాలు మొదలు..!

Ramayanam : హిందూ శాస్త్రంలో అత్యంత పవిత్ర ఘట్టం రామాయణ మహాకావ్యం.. వాల్మీకి మహర్షి రచించిన ఈ కావ్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. రాముడి గాథను ఎన్నిసార్లు విన్నా.. ఎన్నిసార్లు చూసినా ఎప్పటికీ నిత్య నూతనమే.. బహుశా రామాయణం పై తెలుగులో వచ్చినన్ని సినిమాలు.. మరే ఇతర భాషల్లో కూడా రాలేదు.. ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణ కావ్యంగా తెరకెక్కిన ఆది పురుష్ సినిమా రిలీజ్ అయింది.. పూర్తిగా వక్రీకరించి తీయడంతో సినిమాను ప్రేక్షకులు తిరస్కరించారు.. దీంతో ఈ సినిమాపై మళ్ళీ రాజమౌళి దృష్టిపడిందనే వార్తలు కూడా వినిపించాయి.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటున్న రాజమౌళి.. ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తారు అని అభిమానులు సైతం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు..

లాంఛనంగా పూజా కార్యక్రమాలు..

ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే మన చరిత్రకు సంబంధించిన పురాణ ఇతిహాసాలపై ఎవరికి పేటెంట్ హక్కులు ఉండవు. అందుకే ఎవరు ఎన్నిసార్లు తెరకెక్కించినా.. ప్రేక్షకులు వాటిని ఆదరిస్తూనే ఉంటారు.. ఈ క్రమంలోనే దంగల్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ నితీష్ తివారి కూడా రణబీర్ కపూర్ ను శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా , యష్ రావణాసురుడిగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అన్ని భాషల స్క్రిప్ట్ రైటింగ్ కూడా పూర్తి అయింది.. భారీ అంచనాల మధ్య డైరెక్టర్ నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు లాంఛనంగా ముంబైలో ప్రారంభం అయ్యాయి..

ముంబై స్టూడియో లో పూజా కార్యక్రమాలు..

తెలుగులో ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు సమకూర్చగా.. ఈ సినిమాలో శ్రీరామనవమికి కొన్ని రోజులు ముందు అనగా ఏప్రిల్ రెండవ తేదీన రామాయణం ( Ramayanam ) సినిమా ముంబైలోని స్టూడియోలో షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.. భారీ జన సమూహం నేపథ్యంలో షూటింగ్ చేస్తున్న కొన్ని సన్నివేశాలను ఫిక్సరైజ్ చేయనున్నారట. ఇక దేశంలోనే దాదాపు 12 భాషల్లో మూడు భాగాలుగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు అలాగే ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ ను శ్రీరామనవమి రోజున ప్రకటించనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా అయోధ్యలో శ్రీరామ మందిరంలో బాలరాముడు కొలువైన ఈ శుభ సందర్భంలో ఈ సినిమా తెరకెక్కనుండడం శుభ పరిణామం అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాని తెలుగు వాళ్ళైనా అల్లు అరవింద్ , మధుమంతెనతో పాటు పలువురు బాలీవుడ్ నిర్మాతలు కూడా నిర్మాణ భాగస్వామ్యంలో భాగమయ్యారు..

- Advertisement -

సెలబ్రిటీ డీటెయిల్స్..

ఇక బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ విషయానికి వస్తే.. గత ఏడాది చివర్లో యానిమల్ మూవీతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. అటు యశ్ కూడా కేజీఎఫ్ సీరీస్ తో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటారు.. మరొకవైపు సాయి పల్లవి కూడా ప్రస్తుతం నాగచైతన్య తో కలిసి మరొకసారి తండేల్ సినిమా చేస్తోంది. ఇక ముగ్గురు కూడా యూనిక్ పర్సనాలిటీతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.. మొత్తానికి అయితే భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు