Allu Arjun Birthday : బన్నీ బర్త్ డే ట్రీట్ క్యాన్సిల్… ఆ ఒక్క అప్డేట్ తోనే సరిపెట్టుకోవాలి

Allu Arjun Birthday : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజుకు సంబంధించిన హడావిడి ఇప్పటి నుంచే మొదలైపోయింది. ఆయన బర్త్ డే కానుకగా పలు అప్డేట్స్ ఉంటాయని హుషారుగా ఎదురు చూస్తున్నారు అల్లు అభిమానులు. కానీ తాజా సమాచారం ప్రకారం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ను తలకిందులు చేసే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. బన్నీ బర్త్ డే ట్రీట్ క్యాన్సిల్ అయ్యింది. అల్లు అర్జున్ అభిమానులు ఈ ఏడాది ఆయన పుట్టిన రోజు నాడు ఒకే ఒక్క అప్డేట్ తో సరిపెట్టుకోక తప్పని పరిస్థితి నెలకొంది.

రీ రిలీజ్ లు క్యాన్సిల్…

ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు. చాలా రోజుల నుంచి ఈ రోజు కోసం బన్నీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఏప్రిల్ 2న “పుష్ప 2” నుంచి బన్నీ బర్త్ డే ట్రీట్ గా టీజర్ రాబోతుందని ప్రకటించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అవుతుందనే వార్త అల్లు అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. కానీ అంతలోనే వాళ్లకి మరో బ్యాడ్ న్యూస్ వచ్చేసింది. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ అప్డేట్ మాత్రమే కాకుండా ఆయన కెరీర్లో సూపర్ హిట్ గా నిలిచిన జులాయి మూవీ, యావరేజ్ గా నిలిచిన ఆర్య 2 సినిమాలను రీ రిలీజ్ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ రెండు సినిమాల రీ రిలీజ్ వాయిదా పడిందని తెలుస్తోంది. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అల్లు అర్జున్ బర్త్ డేకి కాకుండా ఈ ఏడాది చివర్లో జులాయి, ఆర్య 2 సినిమాలను రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎప్పటి నుంచో ఈ రెండు సినిమాల రీ రిలీజ్ కోసం ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అల్లు ఫ్యాన్స్ ఈ వార్తలతో నిరాశకు గురవుతున్నారు.

ఒక్క అప్డేట్ తోనే సరిపెట్టుకోక తప్పదా?

రీ రిలీజ్ ట్రీట్ క్యాన్సిల్ కావడంతో ప్రస్తుతం అల్లు ఫాన్స్ తమ అభిమాన హీరో బర్త్ డే ( Allu Arjun Birthday ) రోజున “పుష్ప 2” టీజర్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేలా ఉంది. అయితే అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఆయన కొత్త సినిమాల అప్డేట్స్ కూడా రాబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. త్వరలోనే అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లితో సినిమా చేయబోతున్నాడు అనే వార్త గత కొంతకాలంగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏప్రిల్ 8న రాబోతోందని అంటున్నారు. కానీ ఇందులో ఎంత వరకు నిజం ఉందనేది తెలీదు. మరోవైపు కొంతమంది అల్లు ఫ్యాన్స్ బన్నీ బర్త్ డే ట్రీట్ గా “పుష్ప 2″ టీజర్ వచ్చినా చాలు. ఆ రోజంతా సోషల్ మీడియా రికార్డులు బద్దలవ్వడానికి అంటూ లైట్ తీసుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు