మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీ స్టారర్ గా వచ్చిన సినిమా ఆచార్య. టాలీవుడ్ కు వరుస హిట్స్ అందించిన కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఏప్రిల్ 29న గ్రాండ్ గా రిలీజ్ అయింది. తండ్రీ కొడుకులు ఫస్ట్ టైం ఒకే తెరపై సందడి చేయడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆచార్య అంచనాలను తలకిందలు చేస్తూ, బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.
కాగ ఆచార్య మూవీ టీం తాజా గా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 20 నుంచి ప్రసారం కానున్నట్టు తెలిపారు. ఆచార్య మూవీపై మొదటి ఆట నుండే నెగిటివ్ టాక్ రావడంతో చాలా మంది థియేటర్స్ వెళ్లలేదు. అలాంటి వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి.
ఈ నెల 20 రామ్ చరణ్, తారక్ మల్టీ స్టారర్ నటించిన ట్రిపుల్ ఆర్ మూవీ కూడా జీ5 ఓటీటీ ప్లాట్ ఫాంలో ప్రసారం కాబోతుంది. అయితే ఈ మూవీ మార్చి 24న రిలీజై నేటికి 50 రోజులు పూర్తి చేసుకుంది.
they call him Acharya because he always teaches them a lesson💥#AcharyaOnPrime, May 20 pic.twitter.com/5l4wnFgLn7
— prime video IN (@PrimeVideoIN) May 13, 2022