Ott: కాలం మారింది

కాలానికి అనుగుణంగా పరిస్థితులు మారుతాయి అంటారు.
బయట పరిస్థితులు ఏమో కానీ, సినీ పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. చాలా సినిమా థియేటర్స్ మూతపడి కళ్యాణ మండపాలుగా మారిపోయాయి. అప్పటిలా ప్రేక్షకులు కూడా థియేటర్లకి రావడం మానేసారు. ఇప్పుడు సినిమాలు కూడా 2 వారలు కంటే ఎక్కువగా ఆడట్లేదు.

ఈ క్రమంలోనే ఓటిటి ప్లాట్ఫ్రామ్స్ కి మంచి ఆదరణ లభించింది.
కొత్తగా రిలీజైన సినిమాలు కొద్ది రోజుల్లోనే ఓటిటి లో అందుబాటులోనికి వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు ఒక కొత్త సినిమా టీవీ లో రావడానికి చాలాకాలం పట్టేది, ఆ తరువాత విసిడి,డీవీడీ లు వచ్చిన తరువాత వీడియో లైబ్రెరీ షాప్స్ కి ఎక్కువ ఆదరణ ఉండేది.

ఇప్పుడు అలా కాదు సరిగ్గా రెండు, మూడు వారాలు ఆగితే చాలు కొత్తగా రిలీజైన సినిమాని ఇంట్లో కూర్చుని హాయిగా చూడొచ్చు. పైగా టికెట్ రేట్లు కూడా భారీగా పెరగడంతో ఓటిటి కి మొగ్గుచూపుతున్నారు ప్రేక్షకులు.
ఈ నెలలో చాలా సినిమాలు ఓటిటిలో రిలీజ్ కానున్నాయి వాటిలో ట్రిపుల్ ఆర్, ఆచార్య సినిమాలతో పాటు వారం క్రిందే రిలీజైన “భళా తందనాన” కూడా ఈ నెల 20న ఓటిటిలో రిలీజ్ కానుంది.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు