Ban on OTT: ఓటీటీలను బ్యాన్ చేసిన కేంద్రం.. రీజన్ ఎంటంటే..?

ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత అశ్లీల కంటెంట్ కు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. చాలామంది ఈ విషయంపై ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తాజాగా అశ్లీల కంటెంట్ ను ప్రసారం చేస్తున్న పలు ఓటీటీలపై కొరడా ఝులిపించింది. ఏకంగా 18 ఓటీటీలను బ్యాన్ చేసి షాక్ ఇచ్చింది. కేవలం ఓటీటీలే కాదు వాటికి సంబంధించిన 10 యాప్స్, 19 వెబ్సైట్లు, 17 సోషల్ మీడియా ఖాతాలను కూడా బ్యాన్ చేసి పారేసింది.

హెచ్చరికలు బేఖాతరు…
ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే కంటెంట్ కు సెన్సార్ లేకపోవడంతో అశ్లీలత బాగా పెరిగిపోయింది. బూతులు మాట్లాడడం ట్రెండ్ అయ్యింది. ఇక బోల్డ్ కంటెంట్ కు కొదవేలేదు. శృతిమించిన హింస రచ్చ ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఓటిటి కంటెంట్ పై అభ్యంతరాలు ఎక్కువవ్వడంతో పలు ఓటిటి సంస్థలపై ఇప్పటికే కేంద్రం పలుమార్లు సీరియస్ అయింది. అశ్లీలతను తొలగించి, బోల్డ్ కంటెంట్ లో తగ్గించాలని ఎన్నోసార్లు ఓటీటీలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ ఆ హెచ్చరికలు పట్టించుకోని పలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అశ్లీల కంటెంట్ ను ప్రసారం చేయడం ఎప్పటిలాగే కంటిన్యూ చేస్తూ వచ్చాయి. దీంతో మొత్తానికి అశ్లీల కంటెంట్ ను స్ట్రీమింగ్ చేస్తున్న ఓటీటీలను బ్యాన్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం అంటే మార్చ్ 14న 18 ఓటీటీలపై నిషేధం విధించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. అందులో పలు ఓటీటీలకు కోటికి పైగా డౌన్లోడ్స్ ఉండగా, మరో రెండు ఓటీటీలకు 50 లక్షల పైగా డౌన్లోడ్స్ ఉన్నట్టు ప్రభుత్వం స్వయంగా వెల్లడించింది. ఆ 18 ఓటిటిలు కూడా సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించుకుని, అందులో అశ్లీల ట్రైలర్లు రిలీజ్ చేసి ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలియజేశారు. వాళ్లకు సోషల్ మీడియా ఖాతాల ద్వారా మొత్తంగా 32 లక్షల మంది ఫాలోవర్లో ఉన్నారనే విషయాన్ని కూడా వెల్లడించారు.

బ్యాన్ చేసిన 18 ఓటీటీలు ఇవే…
ఇక తాజాగా బ్యాన్ అయిన యాప్స్, ఓటీటీల లిస్ట్ విషయానికి వస్తే… రాబిట్, ఎక్స్ట్రా మూడ్, నియాన్ ఎక్స్ విఐపి, బేషరమ్స్, హంటర్స్, మూడ్ ఎక్స్, న్యూ ఫ్లిక్స్, మోజ్ ఫ్లిక్స్, హాట్ షార్ట్స్ విఐపి, ఫుజి, చికు ఫ్లిక్స్, ప్రైమ్ ప్లే, డ్రీమ్ ఫిలిమ్స్, వూవి, అన్ కట్ అడ్డా, ట్రై ఫ్లిక్స్ వంటివి బ్యాన్ చేసిన లిస్ట్ లో ఉన్నాయి. ఈ ఓటిటిలు, యాప్స్ లో ఎక్కువగా అశ్లీలమైన కంటెంట్ ఉందని, ముఖ్యంగా మహిళలను కించపరిచే విధంగా అవి ఉన్నాయని సమాచార శాఖ ప్రకటించింది. లైంగిక చర్యలను తప్పుడు విధానంలో చూపిస్తున్నారని, స్టూడెంట్స్ టీచర్స్ మధ్య లైంగిక సంబంధాలు, కుటుంబంలో అక్రమ సంబంధాల వంటివి ఇందులో ఉండడం వల్లే నిషేధం విధించామని సమాచార శాఖ వివరించింది. దీంతో ఇకపై ఇలాంటి కంటిన్యూ స్ట్రీమింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చినట్టుగా అయ్యింది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన తాజా చర్యలపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓటిటికి కూడా సెన్సార్ షిప్ ఉంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు