Samyuktha Menon: మళ్లీ సంయుక్తనే హీరోయిన్… త్రివిక్రమ్ గురించి తెలిసిందిగా…!

సంయుక్త మీనన్.. ప్రస్తుతం తెలుగు మార్కెట్లో డిమాండ్ ఉన్న గ్లామర్ బ్యూటీ అని చెప్పొచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పాన్ ఇండియా హీరో రానా కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈమె. ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ధనుష్ హీరోగా తెలుగులో నేరుగా నటించిన సార్ సినిమాతో మరొకసారి తన అందంతో అందరినీ కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. విరూపాక్ష లో విలన్ గా నటించి అబ్బురపరిచింది. అలా తన నటనతో ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకొని టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా పేరు దక్కించుకుంది సంయుక్త.

సంయుక్త మీద కెరియర్..
ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయిన సంయుక్త ఇప్పటివరకు నటించిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్టే అని చెప్పవచ్చు. అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే బడా హీరోలకి కూడా సంయుక్త మీనన్ ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది. పైగా కళ్యాణ్ రామ్ తో ఈమె చేసిన రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి..

సినిమాలకు దూరం..
ఇదిలా ఉండగా గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు సంయుక్త మీనన్ సంతకం చేయడం లేదు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈమెకు సంబంధించిన పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.. గత కొద్ది రోజులుగా ఈమె తెలుగు సినిమాలు ప్రకటించకపోయేసరికి సినిమాలకి గుడ్ బై చెప్పబోతుందని.. త్వరలోనే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వబోతోంది అంటూ ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ వీటికి చెక్ పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

అల్లు అర్జున్ మూవీ లో అవకాశం..
ఇక తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత గురూజీ త్రివిక్రమ్ దర్శకత్వంలో తన తదుపరిచిత్రాన్ని చేయబోతున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ ను సెలెక్ట్ చేశారు అన్న వార్తలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అయితే అల్లు అర్జున్ సినిమాలో ఈమె అవకాశం కొట్టేసిందనే వార్తలు వినిపిస్తుండగా. మరొకవైపు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు కాబట్టి అందుకే ఈమెను హీరోయిన్గా తీసుకున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇండస్ట్రీలో రూమర్స్..
ఇక అసలు విషయంలోకి వెళ్తే గత కొంతకాలంగా త్రివిక్రమ్ – సంయుక్త మీనన్ మధ్య ఏదో ఉందనే వార్తలు మీడియాలో కోడై కూస్తున్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలలో కూడా సంయుక్తాకి అవకాశం ఇవ్వడమే కాదు తన భార్య సాయి సౌజన్య నిర్మించే చిత్రాలలో కూడా సంయుక్తాకే అవకాశం కల్పిస్తూ ఉండడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. పైగా ఒక సినిమా ఈవెంట్ లో వీరిద్దరూ చేతిలో చేయి వేసుకొని కెమెరా కంటపడ్డారు.

దీంతో ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు మరింత జోరుగా వినిపించాయి. దీనికి తోడు ఇప్పుడు మళ్లీ తాను దర్శకత్వం వహించే సినిమాలో సంయుక్తాకే అవకాశం ఇచ్చారు అంటూ వార్తలు రాగా మరొకసారి ఈ వార్తలు తెరపైకి వచ్చాయి. ఏది ఏమైనా అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ చేసే సినిమాలో సంయుక్త ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ సినిమాలో సంయుక్త నటిస్తే రూమర్లకు మరింత ఆజ్యం పోసినట్టు అవుతుంది. మరి త్రివిక్రమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు