Venkatesh: సైలెంట్ గా వెంకీ రెండో కూతురు పెళ్లి… ఎందుకంటే?

సాధారణంగా సెలబ్రిటీల ఇంట పెళ్లి అంటే ఆ ముచ్చట వేరుగా ఉంటుంది. పెళ్లికూతురు, పెళ్లి కొడుకుతో పాటు వాళ్ళ పెళ్లికి హాజరయ్యే సెలబ్రిటీల సందడి మామూలుగా ఉండదు. కానీ తాజాగా సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ మాత్రం తన చిన్న కూతురు వివాహాన్ని సైలెంట్ గా చేసేస్తున్నారు. మరి ఆయన ఎందుకలా చేస్తున్నారు? అనే వివరాల్లోకి వెళ్తే…

పెళ్లి ముహూర్తం ఎప్పుడు అంటే?
టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ ఇంట్లో పెళ్లి బాజాలు మొదలయ్యాయి. ఆయన రెండో కుమార్తె హాయవాహిని పెళ్లి వేడుకలు ఈరోజు (మార్చ్ 15న) ఎలాంటి చడీ చప్పుడు లేకుండా సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు. హయవాహిని విజయవాడకు చెందిన డాక్టర్ ను పెళ్లి చేసుకోబోతోంది. రామానాయుడు స్టూడియో వేదికగా శుక్రవారం రోజు జరగనున్న ఈ వేడుకకు కేవలం వెంకటేష్ సన్నిహితులు, అతి కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే హాజరుకానున్నారని తెలుస్తోంది. ఈ వేడుకకు సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు ఎవ్వరూ హాజరయ్యే అవకాశం లేదనే టాక్ నడుస్తోంది. మరి వెంకీ ఎందుకిలా చేస్తున్నారు అంటే… ఆయన తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను పబ్లిక్ చేయడానికి అస్సలు ఇష్టపడరు. అందుకే ఆయన సినిమాలకు సంబంధించి ఎలాంటి ఈవెంట్లు జరిగినా, అందులో వెంకీ కుటుంబం నుంచి ఎవ్వరూ కనిపించరు.

గత ఏడాది ఎంగేజ్మెంట్…
2023 అక్టోబర్ నెలలో హయవాహినికి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుకను కూడా వెంకటేష్ ఎలాంటి హంగామా లేకుండా నిర్వహించారు. అయితే మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు వంటి సూపర్ స్టార్స్ హయవాహిని ఎంగేజ్మెంట్ వేడుకలో తలుక్కున మెరిశారు. అలాగే నిశ్చితార్థం వేడుకకు దగ్గుబాటి కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు.

- Advertisement -

వెంకటేష్ ఫ్యామిలీ స్టోరీ….
హీరో వెంకటేష్ భార్య పేరు నీరజ. ఈ దంపతులకు నలుగురు సంతానం కాగా, అందులో ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి. పెద్దమ్మాయి పేరు ఆశ్రిత. ఆమె హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ మనవడు వినాయక్ రెడ్డిని ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఇక పెళ్లయ్యాక వినాయక్ రెడ్డి, ఆశ్రిత జంట విదేశాల్లో సెటిల్ అయిపోయారు. ప్రస్తుతం ఆశ్రిత ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతోంది. అందులో లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ కు సంబంధించిన పలు వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆశ్రిత సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇక ఇప్పుడు చిన్న కూతురు హయవాహిని పెళ్లి కూడా జరుగుతుంది. అయితే పెళ్లికొడుకు సంబంధించిన వివరాలు పెద్దగా బయటకు రాలేదు. ఇక వెంకటేష్ కొడుకు పేరు అర్జున్. ప్రస్తుతం టీనేజ్ లో ఉన్న అతను త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది.

వెంకటేష్ సినిమాల విషయానికి వస్తే…
రీసెంట్ గా సంక్రాంతి రేస్ లో “సైంధవ్” మూవీతో పోటీ పడ్డారు వెంకటేష్. కానీ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. వెంకటేష్ కెరీర్ లో 75వ మూవీగా రూపొందిన “సైంధవ్” గుర్తుండిపోయే మూవీ అవుతుందని భావించిన వెంకీ అభిమానులకు షాక్ ఇచ్చేలా వచ్చింది రిజల్ట్. నెక్స్ట్ వెంకటేష్ మరోసారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో మూవీ చేయబోతున్నారు. ఈ మూవీని దిల్ రాజు నిర్మించబోతున్నట్టు సమాచారం.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు