Lifestyle: ఈ అలవాట్లు ఉంటే ఏజ్ తో సంబంధం లేకుండా యంగ్ గా కనిపిస్తారు

కాలం పరుగులు తీయడం ఆపదు. అలాగే పుట్టిన నెక్స్ట్ మినిట్ నుంచి ఏజ్ పెరగడం ఆగదు. కానీ చాలామంది ఏజ్ తో సంబంధం లేకుండా యంగ్ గా ఉండాలని కోరుకుంటారు. తమ వయసు కంటే తక్కువ ఏజ్ ఉన్నట్లుగా భావించే వ్యక్తులు ఉత్సాహంగా, శక్తివంతంగా కనిపిస్తారు. దీంతో వాళ్ళు చూడ్డానికి యవ్వనంగా కనిపిస్తారు. దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటంటే వాళ్లలో ఉన్న కొన్ని అలవాట్లే. మరి వయసు అనేది నిజానికి ఒక సంఖ్య మాత్రమే అని నిరూపించి, ఏజ్ తో సంబంధం లేకుండా యంగ్ గా కనిపించేలా చేసే ఆ అలవాట్లు ఏంటి? అంటే…

1. పాజిటివ్ గా డేను స్టార్ట్ చేయడం…

పాజిటివ్ మనస్తత్వంతో రోజును ప్రారంభించాలి. అదే యంగ్ గా కనిపించే వ్యక్తులకు ఉండే బలం. ఫలితంగా రోజంతా ఉత్సాహంగా గడిపేస్తారు.

- Advertisement -

2. శారీరక శ్రమకు ప్రాధాన్యత…

ఏజ్ తో సంబంధం లేకుండా యంగ్ గా కనిపించే వ్యక్తులు ఫాలో అయ్యే అలవాట్లలో వ్యాయామం కూడా ఒకటి. శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడానికి వాళ్ళు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. నడవడం, యోగ లేదా డాన్స్ క్లాస్ వంటివి రెగ్యులర్ గా ఫాలో అవుతారు. దీనివల్ల చురుగ్గా ఉండడమే కాకుండా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాయామం చేస్తున్నప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్ అనే హార్మోన్ వల్ల మానసిక స్థితి మరింత ఉత్సాహంగా మారుతుంది. శారీరక శక్తి పెరుగుతుంది. రోజంతా ఆహ్లాదంగా ఉండగలుగుతారు.

3. అల్పాహారం ముఖ్యమే…

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఒక్క పూట తినకపోతే ఏమవుతుంది? అనే ఆలోచనతో చాలామంది సమయానికి తిండి తినకుండా కడుపు కాల్చుకుంటూ ఉంటారు. కానీ టైంకి తిన్నప్పుడే మరింత ఎనర్జిటిక్ గా పని చేయగలుగుతారన్న విషయాన్ని మర్చిపోతారు. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయొద్దు. మైండ్ ఫుల్ నెస్ ఈటింగ్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి యవ్వనంగా కనిపించాలి అంటే పోషకాలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ చేయడం మర్చిపోకండి. ముఖ్యంగా చర్మాన్ని వృద్ధాప్య ఛాయల నుంచి రక్షించడానికి హెల్ప్ చేసే సిట్రస్ పండ్లు, విటమిన్ సి, ఈ అధికంగా ఉండే ఆహారాన్ని బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోండి. ఇంకా ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, ఒమేగా 3 ఫ్యాట్స్, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఫుడ్ ను తీసుకోండి.

4. హైడ్రేట్ గా ఉండాల్సిందే….

మన శరీర బరువులో 50% నుంచి 70% వరకు నీటిదే ఉంటుంది. ప్రతిరోజు శరీరానికి కావాల్సినంతగా వాటర్ తాగకపోతే అలసిపోతారు. శారీరకంగా చురుకుగా, యంగ్ గా ఉండాలి అనుకుంటే రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగడాన్ని అలవాటు చేసుకోండి. ఒకేసారి ఎక్కువగా తాగకుండా కొద్దికొద్దిగా రోజంతా తాగుతూ ఉండండి. ఇలా తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. ఇంకేముంది చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

5. రిలేషన్స్ ను పెంచుకోవాల్సిందే…

సోషల్ కనెక్షన్స్ అనేవి ఎమోషనల్ సపోర్ట్, కంపానియన్ షిప్ వంటివి అందిస్తాయి. అంతేకాదు యంగ్ గా, ఉత్సాహంగా ఉంచడంలో కీలకపాత్రను పోషిస్తాయి. మన చుట్టూ పాజిటివిటీ ఉన్నప్పుడు సహజంగానే ఉత్సాహం పెరుగుతుంది. అందుకే ఏజ్ తో సంబంధం లేకుండా యంగ్ గా కనిపించే వ్యక్తులు సామాజికంగా చాలా చురుగ్గా ఉంటారు.

6. హాబీలను మర్చిపోవద్దు…

కాలక్షేపం కోసం ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తూ ఉంటారు. పెయింటింగ్, గార్డెనింగ్, వంట చేయడం, చదవడం వంటి హాబీల కోసం సమయాన్ని కేటాయించండి. ఇలా చేయడం వల్ల విశ్రాంతి దొరకడమే కాకుండా క్రియేటివిటీ పెరుగుతుంది.

7. మార్పుకు భయపడడం…

జీవితం అనేది హెచ్చుతగ్గులు, ఊహించని మలుపులతో కూడిన రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. కాబట్టి యంగ్ గా కనిపించాలి అనుకునే వ్యక్తులు మార్పులకు భయపడే బదులు వాటిని స్వాగతిస్తారు. కంఫర్ట్ జోన్ నుంచి బయటపడడానికి ఎవరికైనా భయమే. కానీ దానివల్ల కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ఎదగడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది. యంగ్ గా కనిపించాలంటే మార్పును ముప్పుగా కాకుండా అవకాశంగా చూడాలి.

8. నిద్ర
శరీరానికి విశ్రాంతి కావాలంటే తగినంత నిద్ర పోవాల్సిందే. కాబట్టి ప్రతి రోజూ 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోతే ఏకాగ్రత పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.

9. మైండ్ ఫుల్ నెస్
మైండ్ ఫుల్ నెస్ అనేది ఒక యాంటీ ఏజింగ్ రెమిడి అని ఇప్పటికే ప్రూవ్ అయింది. ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు