Sreeleela : సాయి పల్లవిని దాటేస్తుందా ?

సాయి పల్లవి అంటే నటన.. అభినయం.. అందం.. అన్నింటికి మించి డ్యాన్స్ గుర్తుకువస్తాయి. 2015లో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన ఈ తమిళనాడు భామ, తెలుగులోనూ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ను దక్కించుకుని తన సత్తా చాటుతుంది. అయితే సాయి పల్లవి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని రోజుల నుంచి సిల్వర్ స్క్రీన్ కు కాస్త దూరంగా ఉంటుంది. ఇదే అదనుగా భావించిన కొంత మంది యంగ్ హీరోయిన్స్.. సాయి పల్లవి స్థానాన్ని కొట్టేయడానికి రెడీ అవుతున్నారు.

అందులో మొదటి వరసలో ఉంది యంగ్ హీరోయిన్ శ్రీలీల. ఈమె కూడా తెలుగు హీరోయిన్ కాదు. కన్నడలో ఎంట్రీ ఇచ్చిన ప్రస్తుతం తెలుగులో దుమ్ములేపుతుంది. తెలుగు చేసింది రెండు సినిమాలే అయినా క్రేజ్ మాములుగా లేదు. ఇటీవల వచ్చిన ధమాకా ఫలితం ఎలా ఉన్నా.. ఈ అమ్మడు కు మంచి మార్కులు పడుతున్నాయి. శ్రీలీల నటన, అందం విషయంలో ఇప్పటికే పెళ్లి సందD తో ప్రూఫ్ చేసుకుంది. తాజాగా తనలో ఉన్న డ్యాన్స్ ను ధమాకాతో ప్రేక్షకులకు పరిచయం చేసింది.

ధమాకా సినిమాలో పాటలలో శ్రీలీల కనిపించినా ప్రతిసారి ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ సూపర్ గా వస్తోంది. ఆమె మాస్ డ్యాన్స్ యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. నిజానికి శ్రీలీల మంచి నటితో పాటు డ్యాన్సర్ కూడా. దీన్ని డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన బాగా ఉపయోగించుకున్నాడు. అయితేే శ్రీలీల మరో రెండు మూడు సినిమాలు ఇదే జోష్ లో చేస్తే.. సాయి పల్లవిని దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

అయితే సాయి పల్లవికి తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం ఉంది. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినా, సాయి పల్లవికి మంచి మార్కులే పడుతాయి. కొన్ని సినిమాలు కేవలం లేడీ పవర్ స్టార్ వల్లే హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సాయి పల్లవిని శ్రీలీల క్రాస్ చేయాలంటే చాలానే కష్టపడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు