Bhagavanth Kesari: చరిత్రలో నిలిచిపోతాడా?… చిరిగిపోతాడా?

“అడవి బిడ్డ… నేలకొండ భగవంత్ కేసరి… ఈ పేరు శానా ఏళ్లు యాదింటది” బాలయ్య సినిమా భగవంత్ కేసరి టీజర్ వచ్చినప్పుడు వినపడ్డ డైలాగ్ ఇది. సినిమా ఏమో గానీ, ఈ డైలాగ్ మాత్రం చాలా రోజులు వినిపించింది. టీజర్‌కే ఇలా ఉంటే, సినిమా రిలీజ్ అయితే ఎంకెన్నీ రోజులు వినిపిస్తుందో… అని కూడా అనుకున్నారు.

దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ కానున్న ఈ మూవీకి ఇప్పటి వరకు మంచి రెస్పాన్సే ఉంది. సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్ గానే ఉంది అన్నట్టు టాక్ వచ్చింది. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాతో తనలో తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నట్టు పలు వేదికలపై చెప్పాడు. అలాగే ట్రైలర్‌లో చూపించింది చాలా తక్కువ అని, సినిమా చూస్తే కొత్త ఎక్స్‌పీరియన్స్ ఉంటుందని కూడా టాక్ వస్తుంది. అలా మొత్తానికి బాలయ్య భగవంత్ కేసరి మూవీపై ఇప్పటి వరకు అయితే పాజిటివ్ వైబ్ ఉంది.

అయితే ఇక్కడో చిన్న సమస్య ఉంది. బాలయ్య గత రెండు సినిమాలు అఖండ, వీర సింహరెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు రాబోయే సినిమాపై అభిమానులకు సాధారణంగానే అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. అందులో ఏ మాత్రం మైనస్ అయినా, సినిమా మొత్తానికి దెబ్బ పడే అవకాశం ఉంది. పైగా అఖండ, వీర సింహరెడ్డి సినిమాల్లో బాలయ్య తనకు అచ్చొచ్చిన మాస్ యాక్షన్ పాత్ర చేశాడు. కానీ, ఈ భగవంత్ కేసరి మూవీలో మాత్రం బాలయ్య పాత్ర కాస్త ఫ్యామిలీ టచ్‌తో ఉంటుంది. ఇది బాలయ్య ఫ్యాన్స్‌ను టచ్ చేస్తుందా? అనేది ప్రశ్న.

- Advertisement -

అలాగే అనిల్ రావిపూడి ఎప్పుడూ కామెడీ ఎంటర్‌టైన్ సినిమాలు చేస్తూ ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేస్తాడు. కానీ, ఇప్పుడు తన స్టైల్‌ను మార్చుకుని భగవంత్ కేసరి చేస్తున్నాడు. మరీ ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందా? అనేది మరొక ప్రశ్న.

మరొకటి ఏంటంటే… ఈ దసరాకు భగవంత్ కేసరితో పాటు లియో, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలకు కూడా ప్రస్తుతం పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఇందులో ఏ ఒక్క మూవీ కాస్త నెగిటివ్ టాక్ వచ్చినా, ఆ సినిమా ఇక కోలుకోలేదు. లియో LCU భాగంగా వస్తుంది. కాబట్టి దానికి నెగిటివ్ టాక్ వచ్చినా నెట్టుకురావొచ్చు. టైగర్ నాగేశ్వరరావు మూవీ ఒక బయోపిక్. దీని కోసం ఒక తెలుగులోనే కాదు, పాన్ ఇండియా వైడ్ గా ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అంటే ఈ రెండు సినిమాలు కూడా కంటెంట్ బేస్డ్ చేసుకుని ఆడే అవకాశాలు ఉన్నాయి. మరీ వీటిని భగవంత్ కేసరి తట్టుకుంటాడా? అనేది మరో ప్రశ్న.

వీటిని ఎదుర్కొంటేనే భగవంత్ కేసరి పేరు శానా ఏళ్లు యాదుంటది. చరిత్రలో నిలబడుతుంది. లేదంటే.. భగవంత్ కేసరి చరిత్ర నుంచి చిరిగిపోవడం ఖాయం.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు