Bhagavanth kesari: మోక్షజ్ఞ తో సినిమా చేస్తావా.. అందరి ముందే ఆ హీరోయిన్ డేట్స్ అడిగిన బాలయ్య

నటసింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకును హీరోగా లాంచ్ చేసే సినిమా కోసం భారీ కసరత్తులు చేస్తున్నాడనే విషయం అందరికి తెలిసిందే. గత కొన్నేళ్లుగా మోక్షజ్ఞ ను టాలీవుడ్ కు హీరోగా పరిచయం చేసేందుకు సరైన డైరెక్టర్ కోసం, మరియు సాలిడ్ స్క్రిప్ట్ కోసం చూస్తున్న బాలకృష్ణ, లేటెస్ట్ గా మోక్షజ్ఞ పక్కన నటించే హీరోయిన్ కోసం వెతకడం కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తుంది.

నిన్న, మొన్నటి వరకు మోక్షజ్ఞ హీరోగా నటించబోయే సినిమాలో శ్రీలీల పేరు వినిపించగా, ప్రస్తుతం మరో హీరోయిన్ పేరు వార్తల్లోకి ఎక్కింది. అయితే ఎవరు మరి ఆ అదృష్టవంతురాలైన యంగ్ బ్యూటీ అనుకుంటున్నారా.. నిజానికి ఆ బ్యూటీ యంగ్ హీరోయిన్ కాదు. ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అని తెలుస్తుంది. కాజల్ అగర్వాల్, మోక్షజ్ఞ పక్కన హీరోయిన్ గా చేయడమేంటనీ అనుకున్న అసలు విషయం తెలిస్తే అవునా.. అని అంటారు.

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రాబోతున్న లేటెస్ట్ సినిమా భగవంత్ కేసరి , అక్టోబర్ 19న రిలీజ్ అవ్వబోతున్న విషయం తెలిసిందే. ఇక సినిమా రిలీజ్ టైం దగ్గర పడటంతో.. భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలకృష్ణ ఆహా లో హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ షో లో పాల్గొని సందడి చేసారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న కాజల్ కూడా ఈ షో కు అటెండ్ అవడంతో బాలకృష్ణ ఆమెతో సరదాగా మాట్లాడుతూ.. నందమూరి, కొణిదెల హీరోల అందరితో నటించేసావ్.. మరి మా అబ్బాయి మోక్షజ్ఞ తో కూడా నటిస్తావా అని అడగగా కాజల్ సరే అని సమాధానం ఇచ్చింది. దాంతో సోషల్ మీడియా అంత కాజల్ అగర్వాలే మోక్షజ్ఞ సినిమాలో హీరోయిన్ అంటూ వార్తలు గుప్పుమన్నాయి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు