‘సురేష్ ప్రొడక్షన్స్’ అధినేత సురేష్ బాబు, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరు. ఏ సినిమా నిర్మించినా, చాలా పకడ్బందీ ప్లానింగ్ తో నిర్మిస్తూ ఉంటారు. స్క్రిప్ట్ ఏంటి? దాని దర్శకుడు ఎవరు? ఆ కథ వాల్యూ ఎంత? దానికి తగ్గ హీరో ఎవరు? ఇలా చాలా లెక్కలు వేసుకుని కానీ రంగంలోకి దిగుతాడు. డైరెక్టర్ అండ్ టీం కి రూ.10 కోట్ల బడ్జెట్ లిమిట్ పెట్టారంటే, అంత మొత్తంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాల్సిందే. బడ్జెట్ క్రాస్ చేస్తే, దర్శకుడిని అంత ఈజీగా మర్చిపోరు. ‘కలిసుందాం రా’ సినిమాకు 16 లక్షలు ఎక్కువ బడ్జెట్ పెట్టించారు అనే మాట సురేష్ బాబు ఇప్పటికీ చెబుతూనే ఉంటారు. ఇంత అనుభవం ఉన్న వ్యక్తి ఓ మాట చెప్పాడు అంటే దానిని సీరియస్ గా తీసుకోవాలి.
‘విరాట పర్వం’ ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. అసలు సంగతి ఏంటంటే, రానా హీరోగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల రిలీజ్ అయ్యింది. సినిమాకు మంచి టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు ఆశించిన స్థాయిలో నమోదు కావడం లేదు. అయితే, విరాట పర్వం సినిమాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని సురేష్ బాబు ముందుగానే చెప్పారట. ‘ఇలాంటి సినిమాకు మంచి రివ్యూలు వస్తాయి కానీ జనాలు థియేటర్ కు వచ్చి చూడరని, ఇది పక్కా ఓటీటీ సినిమా అని నెట్ ఫ్లిక్స్ నుండి రూ.40 కోట్ల ఆఫర్ ను తెచ్చారట సురేష్ బాబు. కానీ, సురేష్ బాబు నిర్ణయాన్ని మరో నిర్మాత సుధాకర్ చెరుకూరి అంగీకరించలేదని సమాచారం. అనేక సంఘటన మధ్య ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. ఇప్పుడు రివ్యూ పాజిటివ్ గానే వచ్చినా, కలెక్షన్లు మాత్రం నిరాశపర్చస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమా సురేష్ బాబు చెప్పినట్టు ఓటీటీకి ఇచ్చి ఉంటే లాభాలు దక్కుండేవి.