రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక.. వీరిద్దరి మధ్య వస్తున్న పుకార్లు ఇప్పటివి కాదు. వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ కొన్నేళ్లుగా వినిపిస్తున్నాయి. ఇటీవల విజయ్ దేవరకొండ నూతన గృహప్రవేశానికి జరిగినన వేడుకకు రష్మిక హాజరు కావడంతో మరోసారి ఈ జంట గురించి వార్తలు వైరల్ అయ్యాయి. అయితే వీటిపై ఇటు విజయ్ కానీ, అటు రష్మిక గాని స్పందించలేదు. అయితే తాజాగా వీరిద్దరి గురించి మరో ఆసక్తికర విషయం తెర మీదకు వచ్చింది.
అదేంటంటే వీరిద్దరూ కలిసి ఇప్పుడు మాల్దీవులకు వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతుంది. దీనికి కారణం వీరిద్దరూ ముంబై విమానాశ్రయంలో కనిపించడమే. రష్మిక ఎయిర్ ఫోర్ట్ కి చేరుకున్న కాసేపటికి విజయ్ దేవరకొండ కూడా వచ్చాడు. దీంతో మళ్లీ పుకార్లకు ఊతమిచ్చినట్లయింది. అసలు విషయం ఏంటంటే రష్మిక హీరోయిన్ గా నటించిన “గుడ్ బై” సినిమా అక్టోబర్ 7వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంలో రష్మిక అమితాబచ్చన్ కుమార్తె పాత్రలో కనిపించింది. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా ఆమె ముంబై ఎయిర్‌ఫోర్ట్‌లో ఫోటోగ్రాఫర్ల కెమెరాలకు చిక్కింది.
Read More: Waltair Veerayya: వేచి చూడాల్సిందే.
ఆమె అక్కడి నుంచి వెళ్లిన కాసేపటికే విజయ్ దేవరకొండ కూడా రావడంతో వీరిద్దరూ కలిసి మాల్దీవులకు వెళుతున్నారని ప్రచారం మొదలైంది. విజయ్, రష్మిక ఎయిర్‌ఫోర్టుకు చేరుకున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విజయ్ దేవరకొండ తో కలిసి రష్మిక గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు చేసింది. ఈ సమయంలో వీరిద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. అప్పట్లో చాలాసార్లు ఈ జంట బయట తిరుగుతూ మీడియాకి చిక్కారు. దీంతో వీరిద్దరి మధ్య అప్పటి నుంచే పుకార్లు మొదలయ్యాయి.
కాగా.. దీనిపై పరోక్షంగా రష్మిక మందన్న స్పందించింది. గుడ్ బై సినిమా ప్రమోషన్ లో భాగంగా రష్మిక తన ప్రేమ గురించి చెప్పింది. “కుటుంబ సభ్యులు, స్నేహితులతో నేను అందుబాటులో ఉండడం లేదని చెబుతున్నారు. నేను సినిమాలతో బిజీగా ఉండడం వల్ల వారితో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నా. ఇక ప్రేమించడానికి సమయం ఎలా ఉంటుంది. నా జీవితంలో ప్రేమ లాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా తెలియజేస్తాను” అంటూ చెప్పుకొచ్చింది నేషనల్ క్రష్.
Read More: Mahesh Babu: హిట్ కొట్టాల్సిందే
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...
నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ...