బాహుబలి.. ఈ సినిమా తెలుగు చిత్ర సీమ స్థితినే కాదు.. రెబల్ స్టార్ ప్రభాస్ స్థాయి ను కూడా పెంచింది. రెబల్ స్టార్ ను కాస్త పాన్ ఇండియా స్టార్ ను చేసింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా అదే రేంజ్ లో ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలా ఫ్యాన్స్ అంచనాలను అందుకోలేక ఫ్లాప్ మూటగట్టుకున్న సినిమాలు.. సాహో, రాధేశ్యామ్. నిజానికి ఈ రెండు సినిమాలు మరీ ఫ్లాప్ అయ్యేంత దారుణంగా ఏమీ లేవు. ఇంకా చెప్పాలంటే.. ఈ రెండు సినిమాల్లో ప్రభాస్ కాకుండా వేరే హీరోలు కనిపించి ఉంటే.. తప్పకుండా హిట్ అయ్యేవి. కానీ, ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ అంతకు మించి కోరుకుంటున్నారు. అందుకే ఈ సినిమాల నుంచి అలాంటి ఫలితం వచ్చింది.
అందుకే కాబోలు ప్రభాస్ కూడా భారీ సినిమాలనే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. డార్లింగ్ చేతిలో ప్రస్తుతం ఉన్న ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ అన్ని కూడా భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమాలే. దీంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమాల పై భారీగానే అంచనాలు పెట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ప్రభాస్, ఓం రౌత్ కాంబో లో వస్తున్న ఆదిపురుష్ టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ ను మొదట చూసిన తర్వాత చాలా విమర్శలు వచ్చాయి. “500 కోట్ల బడ్జెట్ తో బొమ్మల సినిమా చేశారా ? కార్టూన్ సినిమాలా ఉంది. వీఎఫ్ఎక్స్ కూడా బాగాలేదు” అంటూ దారుణంగా ట్రోల్స్ చేశారు.
Read More: Karthikeya-2 : కార్తికేయ-2 రిలీజ్ డేట్ ఫిక్స్
తొలి టీజర్ తోనే ఆదిపురుష్ పై నెగిటివిటీ రావడంతో ఆది పురుష్ టీం రంగంలోకి దింగింది. తమ సినిమా అందరికి నచ్చుతుంది. టీజర్ కూడా నచ్చుతుంది అనే ప్రయత్నం చేశారు. మొబైల్స్ లో కంటే.. 3డీ లో చూస్తే తమ సినిమా గురించి, వీఎఫ్ ఎక్స్ గురించి తెలుస్తుందని తెలిపారు. హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమా హాల్ లో ప్రత్యేకంగా ఒక ఈవెంట్ ను నిర్వహించి సినీ మీడియా ప్రతినిధులకు, కొంత మంది ఫ్యాన్స్ కు 3డీ టీజర్ ను చూపించారు. దీంతో టీజర్ పై వచ్చిన నెగిటివిటీ మొత్తం మారిపోయింది.
టీజర్ సూపర్ గా ఉందని, సినిమా మరింత బాగా ఉండే అవకాశాలు ఉన్నాయనే నమ్మకాన్ని ఫ్యాన్స్ లో క్రియేట్ చేశారు. సోషల్ మీడియాలో కూడా.. ఆదిపురుష్ పై పాజిటివిటీ వస్తుంది. అలాగే ఈ సినిమాను 2డీ లో కాకుండా.. 3డీలో చూడాలని ఇప్పటి నుంచే ఫ్రీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఒక ఈవెంట్ తో పాజిటివిటీ, 3డీ ప్రమోషన్స్ భారీగా జరిగాయి.
Read More: Malli pelli : నరేష్ చేసిన పనికి దుమ్మెత్తి పోస్తున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్
హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌదరి మనవడు,...
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...