Varun Tej : ఆసక్తిగా !

టాలీవుడ్ యువ హీరోల్లో ఒక‌రు అయిన‌టువంటి వ‌రుణ్ తేజ్ గురించి అంద‌రికీ తెలిసిందే. ఇటీవ‌లే వ‌రుణ్ న‌టించిన గ‌ని నిరాశ ప‌రిచిన‌ప్ప‌టికీ ఎఫ్‌-3 తో మాత్రం విజ‌యాన్ని అందుకున్నాడు. ప్ర‌స్తుతం వ‌రుణ్ ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సిసినిమా వ‌రుణ్‌కి 12వ‌ది. తాజాగా మ‌రో చిత్రానికి క‌మిట్ అయ్యాడు. ఈ చిత్రానికి సంబంధించిన వివ‌రాలను పంచుకుంటూ ఓ వీడియోని విడుద‌ల చేశారు.

ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ నేప‌థ్యంలో ఈచిత్రం కొన‌సాగుతుంద‌ని, ప్ర‌ధానంగా య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగానే రూపొందించ‌బోతున్న‌ట్టు తెలిపారు. బౌండెడ్ స్క్రిప్ట్ చ‌దివి సాటిస్‌పై అయిన వ‌రుణ్ ఈ చిత్రాన్ని ఓకే చేసిన‌ట్టు ఈ వీడియోలో చెప్పారు. ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు ఎవ‌రు..? ప్రొడ‌క్ష‌న్ ఎవ‌రు అనే విష‌యాల‌ను మ‌రో రెండు రోజుల్లోనే అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నార‌ట‌.

ముఖ్యంగా ఏదో స్క్రిప్ట్ చ‌దువుతున్న‌ట్టుగా క‌నిపించి దానికి ఒక హ్యాపీ ఎండ్ క‌నిపించ‌డంతో ఆనందించిన వ‌రుణ్ చివ‌ర‌లో ఒక జెట్‌ని దానిపై పెట్టాడు. ఇక ఈ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఎఫెక్టివ్ గా ఎమోష‌న‌ల్ అనిపిస్తుంది. వ‌రుణ్ 13వ సినిమాపై అయితే ఫుల్ డీటెయిల్స్ సెప్టెంబ‌ర్ 19న బ‌య‌టికి రానున్నాయి. మొత్తానికి వ‌రుణ్ తేజ్ నుంచి ఒక కొత్త స‌బ్జెక్ట్ రాబోతుంద‌నే చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు