Varasudu: ట్రైలర్ రిలీజ్ టైం ఫిక్స్

తమిళ్ నటుడు విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి తీస్తున్న లేటెస్ట్ మూవీ వరిసు. తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ కానున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా, ఎస్.తమన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై విజయ్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు, తమిళ ఆడియన్స్ అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. వారసుడు సినిమా ప్రమోషన్లను చిత్ర బృందం స్టార్ట్ చేసింది.

ఈ మూవీని ఈ సంవత్సరం పొంగల్ కానుకగా జనవరి 12 తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే, తాజాగా వారసుడు రన్ టైమ్ ను కూడా మేకర్స్ రీవిల్ చేశారు. ఈ సంక్రాంతి సినిమాల్లో అన్నింటికంటే పెద్ద మూవీగా ఇది నిలిచింది. ఏకంగా రెండు గంటల 49 నిమిషాల నిడివితో వారసుడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. వారసుడు ట్రైలర్ బుధవారం సాయంత్రం 5 గంటలకు రిలీజ్ కానుంది.

సన్ టీవీ యూట్యూబ్ ఛానల్ లో ఈ ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా సెన్సార్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. దీనికి క్లీన్ యు సర్టిఫికెట్ రావడం విశేషం. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వారసుడు ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు