Okkadu: వర్కౌట్ అవుతుందా

ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ మొదలైన విషయం తెల్సిందే. కానీ అన్ని సూపర్ హిట్ రీ రిలీజ్ సినిమాలకు సరైన ఆదరణ దక్కుతుందా అంటే అది డౌట్ అనే చెప్పొచ్చు. మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా గత ఏడాది ఒక్కడు, పోకిరి సినిమాలను రీ రిలీజ్ చేసారు. ఈ రెండు సినిమాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఒక్కడు సినిమా మహేష్ కెరియర్ లో ఒక మరుపురాని మైలురాయి.
అప్పటివరకు నడుస్తున్న ఒక తెలుగు సినిమా ఫార్ములా ను బ్రేక్ చేసాడు గుణశేఖర్ ఒక్కడు సినిమాతో.
ఈ సినిమా మొత్తం ఒక ఇన్సిడెంట్,మహేష్ బాబు కెరియర్ లో వచ్చిన,
ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించింది అనేది మనకు తెలియని విషయం కాదు.అటు గుణశేఖర్ కెరియర్ కు మంచి పేరు,
ఇటు మహేష్ బాబుకు స్టార్ అనే ట్యాగ్ ను తీసుకొచ్చిన సినిమా ఒక్కడు.

ఈ సినిమా మళ్ళీ జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకి మళ్ళీ మునుపటి స్థాయిలో ఆడియన్స్ బ్రహ్మరధం పడతారా అంటే డౌట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది కేవలం రీ రిలీజ్ కాదు ఇది రీ రీ రిలీజ్ కాబట్టి. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా రీ రిలీజ్ తమ్ముడు, జల్సా సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వాటిలో ఏ సినిమాను మళ్ళీ రి రిలీజ్ చేసిన, ఇప్పుడు ఖుషి సినిమాకి వస్తున్న రెస్పాన్స్ రాదు అని చెప్పొచ్చు. ఎందుకంటే వెండితెరపై ఆయా సినిమాలను చూడాలన్న కోరిక చాలామంది అభిమానులకు తీరిపోయింది. ఈ తరుణంలో ఇదివరకే రీ రిలీజ్ అయినా ఒక్కడు సినిమాకి ఏ స్థాయి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడక తప్పదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు