Varalakshmi Sarath Kumar: పెళ్లి పై క్లారిటీ..ఆ అవకాశం ఇవ్వలేదంటూ..!

Varalakshmi Sarath Kumar..తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కెరియర్లో హీరోయిన్ గా, విలన్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తాను నటించిన ప్రతి పాత్ర కూడా వైవిధ్యంగా ఉండేలా ఎంచుకుంటూ ఉంటుంది వరలక్ష్మి శరత్ కుమార్. క్రాక్ సినిమాతో లేడీ విలన్ గా భారీ క్రేజ్ ను అందుకుంది. నిజానికి ఈమె ప్రస్తుతం నటించిన శబరి సినిమా కూడా క్రాక్ సినిమా కంటే ముందుగానే మొదలు పెట్టారట.. అయితే కొన్ని కారణాల చేత షూటింగ్ ఆలస్యం అవ్వడంతో త్వరలోనే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది.

Varalakshmi Sarath Kumar: Clarity on marriage..as if that opportunity was not given..!
Varalakshmi Sarath Kumar: Clarity on marriage..as if that opportunity was not given..!

శబరి ప్రమోషన్స్ లో వరలక్ష్మీ కామెంట్స్..

ఈ తరుణంలోని ఇంటర్వ్యూలలో పాల్గొన్న వరలక్ష్మి శరత్ కుమార్ తనకు సంబంధించిన విషయాలను కూడా తెలియజేస్తోంది. ముందుగా శబరి సినిమా గురించి తెలియజేస్తూ.. ఈ చిత్రాన్ని నిర్మించిన దర్శక నిర్మాతలు ఇద్దరు కూడా కొత్త వాళ్లే అని.. కానీ కంటెంట్ తనకి బాగా నచ్చడంతో ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని తెలుపుతోంది. తనకు కంటెంట్ నచ్చే హనుమాన్, నాంది, కోటబొమ్మాలి తదితర చిత్రాలలో నటించానని తెలియజేస్తోంది. అయితే శబరి సినిమాలో తను తల్లి పాత్ర చేస్తున్నట్లుగా వెల్లడించింది వరలక్ష్మి.

పెళ్లిపై క్లారిటీ..

అలాగే తన కాబోయే భర్త నికోలమ్ తాను ఎంచుకున్న పాత్రల విషయంలో ఏం చెబుతారు అంటూ యాంకర్ ప్రశ్నించగా.. అందుకు వరలక్ష్మి సమాధానంగా తనకు పాత్ర నచ్చితే బాగుంటుందని. లేకపోతే బాగోలేదని చెబుతారని తెలిపింది. కానీ తాను మాత్రం బాగోలేదని చెప్పే అవకాశాన్ని అసలు ఇవ్వలేదని కూడా తెలియజేసింది వరలక్ష్మి. అయితే ఈ విషయం విన్న అభిమానుల సైతం అప్పుడే తన భర్తను తన గుప్పిట్లో వరలక్ష్మీ పెట్టుకుందా అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆమె మాటలకు మరికొంతమందిని డిజైన్స్ స్పందిస్తూ అంత పర్ఫెక్ట్ గా ఆమె నటిస్తుంది కాబట్టే ఎవరికీ బాగాలేదు అని అనిపించుకునే అవకాశాన్ని ఇవ్వలేదు అని చెప్పుకొచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇక తన వివాహం కూడా ఈ ఏడాదే జరిగే అవకాశం ఎక్కువగా ఉందని తెలియజేసింది. అలాగే శబరి సినిమాలో తన పాత్ర మరొకసారి అందరిని ఆకట్టుకునేలా ఉంటుందని తెలియజేస్తోంది. ఈ సినిమా మే వ తేదీన విడుదల కాబోతోంది.

- Advertisement -

వరలక్ష్మి తదుపరి చిత్రాలు..

అలాగే తన తదుపరిచిత్రం గురించి మాట్లాడుతూ తెలుగులో కూర్మనాయకి, తమిళంలో ధనుష్ తో కలిసి మరొక సినిమా చేస్తున్నాను.. కన్నడలో సుదీప్ మాక్స్ లో నటిస్తున్నట్లు వెల్లడించింది.. ఇవే కాకుండా మరో రెండు మూడు చిత్రాలకు సైన్ చేయవలసి ఉందంటూ తెలిపింది వరలక్ష్మి.. హిట్ ఫ్లాపులు అనేవి ఎవరి చేతుల్లో ఉండవని కేవలం ప్రేక్షకులు ఆదరిస్తేనే సక్సెస్ అవుతాయి లేకపోతే ఫెయిల్యూర్ అవుతాయని తెలిపింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు