Kubera Shooting Update : ముంబైలో ధనుష్, రష్మిక… ప్యాక్ అప్ అంటూ హీరోయిన్ పోస్ట్

Kubera Update : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ కుబేర. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ లేటెస్ట్ అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది. ఇంతకీ ముంబైలో ధనుష్, రష్మిక ఏం చేస్తున్నారు? అనే ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్తే…

ముంబైలో షూటింగ్..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కుబేర మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళిద్దరూ తమ కాస్ట్యూమ్స్ ధరించి షూటింగ్ స్పాట్ కి వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. అలాగే ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ప్యాకప్ షాట్ ను రష్మిక మందన్న ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అండ్ ప్యాకప్ అంటూ ఆన్ లొకేషన్ పిక్ ను పోస్ట్ చేసింది నేషనల్ క్రష్. ఇక సెట్ లో రష్మిక మందన్న సాధారణ చుడీదార్ లో కనిపించగా, ధనుష్ మాత్రం స్టైలిష్ సూట్ ధరించి కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

స్టోరీ ఇదేనా?

తాజాగా ధనుష్ సూట్ లో కనిపించడం చూస్తుంటే ఆయన ఈ సినిమాలో ధనికుడిగా కనిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. కానీ ఫస్ట్ లుక్ లో పోస్టర్లో మాత్రం అతన్ని బిచ్చగాడిగా చూపించారు. దీంతో ముందుగా ధనవంతుడిగా ఉన్న ధనుష్, ఆ తర్వాత పలు కారణాల వల్ల బిచ్చగాడుగా మారతాడని, ఇదే మూవీ స్టోరీ అని ప్రచారం నడుస్తోంది. అయితే ఇదంతా చూస్తుంటే బిచ్చగాడు మూవీ గుర్తొస్తోంది. ఆ సినిమాలో కూడా హీరో రిచ్. కానీ తల్లి ఆరోగ్యం కోసం బిచ్చగాడిగా మారతాడు. మరి కుబేర స్టోరీలో ఎవరి కోసం ధనుష్ బిచ్చగాడిగా మారతాడో చూడాలి. కాగా కుబేర మూవీ ఫస్ట్ లుక్ ను మార్చి 8న రిలీజ్ చేయగా, అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

- Advertisement -

నాగార్జున రోల్ ఇదే…

ఇక ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తుంటే టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రను పోషిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా కనిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. స్టైలిష్ పోలీస్ ఆఫీసర్ గా నాగ్ ను కొత్తగా చూపించబోతున్నారట డైరెక్టర్ శేఖర్ కమ్ముల. నిజానికి నాగ్ తెరపై పోలీస్ ఆఫీసర్ గా కన్పించి చాలా కాలం అవుతోంది. మరి శేఖర్ కమ్ముల కింగ్ ఫ్యాన్స్ కు ఈ సినిమాలో నాగ్ కు కొత్తగా చూపించి మెప్పిస్తారేమో చూడాలి. రీసెంట్ గా నా సామి రంగ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాగార్జున తన నెక్స్ట్ మూవీని ఇప్పటిదాకా అనౌన్స్ చేయలేదు. కానీ కుబేర మూవీలో కీలకపాత్రను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు